నిఖిల్ కి జోడిగా ట్రెడిషనల్ గర్ల్

ట్రెడిషనల్ పాత్రలకు పెట్టింది పేరైన అనుపమ పరమేశ్వరన్ కి ఆ ట్రెడిషనే కొంప ముంచింది. గ్లామర్ తో పాటుగా నటన బావున్నపటికి.. లక్కులేకపోతే అవకాశాలు లేని ఈ [more]

;

Update: 2019-12-24 06:52 GMT
హీరో నిఖిల్
  • whatsapp icon

ట్రెడిషనల్ పాత్రలకు పెట్టింది పేరైన అనుపమ పరమేశ్వరన్ కి ఆ ట్రెడిషనే కొంప ముంచింది. గ్లామర్ తో పాటుగా నటన బావున్నపటికి.. లక్కులేకపోతే అవకాశాలు లేని ఈ రోజుల్లో అటు గ్లామర్, ఇటు లక్కు లేకపోతే నటన ఉంటె ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలా అనుపమ కెరీర్ లో హిట్స్ ఉన్నప్పటికీ.. గ్లామర్ టచ్ లేని కారణంగా అవకాశాలు రావడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి నటించిన రాక్షసుడు సినిమా హిట్ అయినా అనుపమకు మల్లి అవకాశాలు తగలట్లేదంటే ఏమనాలి.

అయితే తాజాగా ఈ క్యూట్ అండ్ స్వీట్ గర్ల్ కి నిఖిల్ కార్తికేయ 2 లో ఆఫర్ వచ్చినట్లుగా టాక్. అర్జున్ సురవరంతో యావరేజ్ హిట్ కొట్టిన నిఖిల్.. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా చేస్తున్నాడు. ఎప్పుడో పట్టాలెక్కిన ఈ సినిమా కొన్ని కారణాల వలన షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. ఇక సినిమా మొత్తం సీరియస్ నెస్ మాత్రమే కాకుండా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోసినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారట. ఇక కార్తికేయ సినిమాలో నిఖిల్ కి జోడిగా కలర్స్ స్వాతి నటించింది. తాజాగా కార్తికేయ 2 కోసం ఇప్పుడు ట్రెడిషనల్ భామ అనుపమ రాబోతుందనేది ఫిలింనగర్ టాక్.

Tags:    

Similar News