అనుష్క కెరీర్ కి ఎండ్ కార్డ్?

అనుష్క కి సైజు జీరో కష్టాలు ఇక వదలవనే అనిపిస్తుంది. ఆ సినిమా కోసం పెరిగిన బరువు దించుకోవడానికి నానా కష్టాలు పడినా వర్కౌట్ అవ్వడం లేదు. [more]

Update: 2020-10-04 05:09 GMT

అనుష్క కి సైజు జీరో కష్టాలు ఇక వదలవనే అనిపిస్తుంది. ఆ సినిమా కోసం పెరిగిన బరువు దించుకోవడానికి నానా కష్టాలు పడినా వర్కౌట్ అవ్వడం లేదు. అందుకే సినిమాలు తగ్గించేసింది. అనుష్క తగ్గించిందా.. లేదంటే దర్శకులే అనుష్కని పక్కనబెట్టారా అనే విషయం క్లారిటీ లేదు కానీ… అనుష్క లేటెస్ట్ మూవీ నిశ్శబ్దంతో అనుష్క కెరీర్ కి ఎండ్ కార్డ్ పడినట్లే అనిపిస్తుంది. బాహుబలి, భాగమతి తర్వాత భారీ గ్యాప్ తో నిశ్శబ్దం సినిమా చేసిన అనుష్క కి ఆ సినిమా వలన ఉపయోగమే లేదు. నిశ్శబ్దం సినిమా పూర్తయిన ఏడాదికి థియేటర్స్ లో కాకుండా ఓటిటి లో విడుదలైన ఈ సినిమాలో అనుష్క మ్యూట్ కేరెక్టర్ లో బాగా బరువైన కేరెక్టర్ చేసింది. 

అనుష్క మెయిన్ లీడ్ అన్నప్పటికీ… సినిమాలో అంజలి కేరెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ అనుష్క కి లేకుండా పోయింది. అంజలి పోలీస్ కాప్ గా బాగా హైలెట్ అయ్యింది. అనుష్క కేరెక్టర్ ని హైలెట్ చేస్తూ సన్నివేశాలు లేవు. కానీ అనుష్క ని ముందు ఎట్టి నిర్మాతలు మాత్రం నిశ్శబ్దం బిజినెస్ చేసేసారు. అంజలి, షాలిని పాండే కి క్రేజ్ లేని కారణముగా అనుష్క కేరెక్టర్ నిశ్శబ్దంలో హైలెట్ అనేలా పోస్టర్స్ పెట్టి సినిమాని అమ్మేసారు. కానీ సినిమాలో అనుష్క కన్నా అంజలి కే స్కోప్ ఎక్కువగా ఉంది. ఇక అనుష్క లుక్స్ పరంగా తేలిపోయింది. డ్రెస్సెస్ బాలేదు. ఇక నిశ్శబ్దానికి ప్లాప్ టాక్ రావడంతో అనుష్కక కి అవకాశాలు రావని… ఇప్పుడు సన్నబడిన ఉపయగం లేదని.. ఇక నిశ్శబ్దం తర్వాత అనుష్క కెరీర్ కి శుభం కార్డు పడడం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News