సినిమాలే ఒప్పుకోవడం లేదు.. మధ్యలో వెబ్ సీరిసా?

అనుష్క నిశ్శబ్దం.. నిశ్శబ్దంగా ఎదురు చూస్తుంది. కరోనా ఎప్పుడు వదలాలి.. ఎప్పుడు విడుదల కావాలి అన్నట్టుగా ఉంది అనుష్క నిశ్శబ్దం పరిస్థితి. భాగమతి తర్వాత చాలా రోజులకి [more]

Update: 2020-08-02 05:37 GMT

అనుష్క నిశ్శబ్దం.. నిశ్శబ్దంగా ఎదురు చూస్తుంది. కరోనా ఎప్పుడు వదలాలి.. ఎప్పుడు విడుదల కావాలి అన్నట్టుగా ఉంది అనుష్క నిశ్శబ్దం పరిస్థితి. భాగమతి తర్వాత చాలా రోజులకి ఒప్పుకున్న సినిమా ఈ నిశ్శబ్దం. అనుష్క బాగా వెయిట్ పెరగడంతో సినిమాలేమి ఒప్పుకోకుండా బరువు తగ్గడంపైనే దృష్టి పెట్టింది. ఇక సినిమాలేమి ఒప్పుకోవడం లేదు. నిశ్శబ్దం తర్వాత కూడా అనుష్క సినిమాలేవి ఒప్పుకోవడం లేదు. ఏదో తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలో అనుష్క నటించబోతుంది ఆనే టాక్ ఉంది కానీ.. అది ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. ఇక తాజాగా అనుష్క ఓ బంపర్ ఆఫర్ వదిలేసినట్టుగా సోషల్ మీడియా టాక్.

ప్రస్తుతం ఓటిటి ట్రెండ్ నడవడంతో.. హీరోయిన్స్ చాలామంది వెబ్ సీరీస్ వెంట పడుతున్నారు. క్రేజ్ ఉన్న సమంతానే బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో సమంత నటించేయ్యగా .. హన్సిక, త్రిష, తమన్నా కాజల్ లాంటి వాళ్ళు కూడా వెబ్ సిరీస్ కి సై అంటున్నారు. అలాగే అనుష్క కి కూడా ఓ పెద్ద బ్యానేర్ భారీ పారితోషకాన్ని వెబ్ సీరీస్ ఆఫర్ చెయ్యగా.. అనుష్క నో చెప్పినట్టుగా వార్తలొస్తున్నాయి. బహు భాషల్లో నిర్మితం కాబోతున్న ఆ వెబ్ సీరీస్ లో అనుష్క నటిస్తే.. ఆ వెబ్ సీరీస్ కి మంచి క్రేజ్ వస్తుందిఆని.. ఇపప్టికే బాహుబలితో అనుష్క ఇండియా వైడ్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది అనుష్క  అందుకే నిర్మాతలు అనుష్క కి భారీ పారితోషకం ఆఫర్ చేసినా అనుష్క మాత్రం నో చెప్పిందట. 

Tags:    

Similar News