అనుష్క.. మాధ‌వ‌న్‌తో క‌లిసి.. కొత్త ఏడాదిలోనే!

Update: 2018-11-28 14:31 GMT

భాగుమ‌తి విడుద‌ల త‌ర్వాత అనుష్క జాడే లేదు. అప్పుడ‌ప్పుడు బ‌య‌ట కొన్ని ఈవెంట్ల‌లో క‌నిపించడ‌మే త‌ప్ప ఆమె సినిమాల ఊసులే వినిపించ‌లేదు. పెరిగిన బ‌రువు త‌గ్గించుకొనే ప్ర‌య‌త్నంలో భాగంగా విదేశాల‌కి వెళ్లింద‌నే వార్త‌లొచ్చాయి. మ‌ధ్య‌లో గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సినిమాతో బిజీ కానుంద‌ని... కాదు కాదు పెళ్లికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంద‌నే మాటలు కూడా వినిపించాయి. అవేవీ నిజం కాలేదు. కానీ ఆమె కొన్ని చిత్రాల‌కి మాత్రం సంత‌కం చేసిన‌ట్టు తెలుస్తోంది. మొట్ట‌మొద‌ట కోన వెంక‌ట్ నిర్మించ‌బోయే ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం కోసం రంగంలోకి దిగ‌బోతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ అనే ఓ యువ ద‌ర్శ‌కుడు ఆ చిత్రాన్ని తెరకెక్కించ‌బోతున్నాడు. ఈ సినిమాతో తొలిసారి అనుష్క హిందీలోకి అడుగుపెట్ట‌బోతోంది. ఇందులో అనుష్క‌తో పాటు మాధ‌వ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

కొత్త యేడాదిలో షురూ

చాలా రోజులుగా విరామం తీసుకుంటున్న అనుష్క వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆస్వాదిస్తూనే, మ‌రోప‌క్క సినిమాల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆమె బాగా బ‌రువు త‌గ్గి స్లిమ్ అయిన‌ట్టు స‌మాచారం. కొత్త చిత్రంలో ఆమె ర‌క‌ర‌కాల షేడ్స్‌లో క‌నిపించ‌బోతోంద‌ని, అందుకోసం ఆమె ప్ర‌త్యేకంగా త‌ర్ఫీదు కూడా పొందింద‌ని తెలిసింది. కొత్త యేడాది ఆరంభంలో మొద‌ల‌య్యే ఈ సినిమాని ద‌క్షిణాదిలోని అన్ని భాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Similar News