ఎట్టకేలకు ఓటీటీలోకి అవతార్ 2.. ఏకంగా 6 గంటల రన్ టైమ్

మార్చి 28న అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీతో పాటు మరికొన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. కానీ ఈ సినిమా

Update: 2023-03-11 13:19 GMT

avatar 2 ott release date

హాలీవుడ్ దర్శక దిగ్గజమైన జేమ్స్ కామెరూన్ రూపొందించిన విజువల్ వండర్ అవతార్ 2. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా.. యావత్ ప్రపంచంలోని సినీ అభిమానులను ఆకట్టుకుని విశేషంగా అలరించింది. భారత్ తో పాటు అన్ని దేశాల్లోనూ ఈ సినిమా రికార్డులు బద్దలుకొట్టింది. థియేటర్లలో సినిమా చూసిన వారు, చూడని వారంతా అవతార్ 2 ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు జేమ్స్ కామెరూన్ అవతార్ 2 ను ఓటీటీల్లో స్ట్రీమ్ చేసేందుకు రెడీ అయ్యాడు.

మార్చి 28న అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీతో పాటు మరికొన్ని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. కానీ ఈ సినిమాను ఆయా ఓటీటీల్లో సబ్ స్క్రైబ్ చేసుకున్నవారంతా చూడలేరు. అవతార్ 2 ను చూడాలంటే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ముందుగా రెంట్ ఆన్ డిమాండ్ కింద ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లో మూడు గంటలకు పైగా సినిమా రన్ టైమ్ ఉండగా.. ఓటీటీలో ఆరుగంటలకు పైగానే రన్ టైమ్ ఉండనుంది. సినిమా రన్ టైమ్ కి అదనంగా మరో మూడు గంటల ప్రత్యేక వీడియో కూడా స్ట్రీమ్ కు రానుంది. చిత్రం షూటింగ్ విశేషాలు, ఇంటర్వ్యూలు ఉండనున్నాయి.







Tags:    

Similar News