బాలీవుడ్ ని షేక్ చేస్తున్న బుల్లి హీరో

బాలీవుడ్ యంగ్ హీరో కం సింగర్ ఆయుష్మాన్‌ ఖురానా మరోసారి తన సత్తా ఏంటో తన కొత్త సినిమాతో నిరూపించుకున్నాడు. రీసెంట్ గా అతను నటించిన డ్రీమ్‌ [more]

;

Update: 2019-09-18 07:52 GMT

బాలీవుడ్ యంగ్ హీరో కం సింగర్ ఆయుష్మాన్‌ ఖురానా మరోసారి తన సత్తా ఏంటో తన కొత్త సినిమాతో నిరూపించుకున్నాడు. రీసెంట్ గా అతను నటించిన డ్రీమ్‌ గాళ్‌అనే సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొదటి మూడు రోజుల్లో ఈమూవీ అత్యధిక వసూళ్లు సాధించింది. తన ప్రతి సినిమాలో ఏదొక వైవిధ్యం చూపిస్తోన్న ఆయుష్మాన్‌ ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

ఆయన నటనతో హీరోలకు నిద్రలేదు…..

తన గత చిత్రం ‘బదాయి హో’ తర్వాత మరోసారి బాక్సాఫీస్‌ వద్ద ఆయుష్మాన్‌ ఖురానా చిత్రం సంచలనం అవుతోంది. మొదటి మూడు రోజుల్లో ఈ మూవీ ఏకంగా నలభై అయిదు కోట్ల నెట్‌ వసూళ్లతో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. మొదటిలో ఈ చిత్రం బాగోలేదు అని చాలామంది అన్నారు కానీ కామెడీ వర్క్ అవుట్ అవ్వడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. చిన్న చిత్రాలతో హిట్ అందుకుంటున్న ఈ చిన్న హీరో మిగతా హీరోలకి నిద్ర లేకుండా చేస్తున్నాడు. పైగా రెండుమూడు నెలలకు ఒక
సినిమా దింపేస్తున్నాడు.

 

Tags:    

Similar News