అందుకేనా ప్రభాస్ సడన్ గా వెనక్కి వచ్చేసాడు?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో చిత్రం ఆగస్టు 30 న రిలీజ్ అయ్యి నెగటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కానీ కలెక్షన్స్ [more]

;

Update: 2019-09-02 10:53 GMT
Bahubhali prabhas cut short his vacation for Saaho promotion
  • whatsapp icon

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో చిత్రం ఆగస్టు 30 న రిలీజ్ అయ్యి నెగటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కానీ కలెక్షన్స్ విషయం లో చాల స్ట్రాంగ్ గా ఉంది ఈమూవీ. బాహుబలి లాంటి కలెక్షన్స్ ఈమూవీకి రావడానికి కారణం ప్రభాస్ కూడా ఒకడు. ఎందుకంటే ఈచిత్రం ప్రమోషన్స్ అన్ని తానే చూసుకున్నాడు. అందుకే ఈమూవీ కి బాగా ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక ఈరోజు వరకు ఈచిత్రం ఏం డోకా లేదు. ఎందుకంటే ఈరోజు నేషనల్ హాలిడే కాబట్టి ఈచిత్రం కి మంచి వసూళ్లు వచ్చే అవకాశముంది. కానీ రేపటినుండి ఈసినిమా భవిషత్తు ఏంటో మాత్రం బయ్యర్ల డిస్ట్రిబ్యూటర్స్ కి అర్ధం కావడంలేదు.ఎందుకంటే ఈమూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రెండువారాలు బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీగా ఉండాలి.

ఇక ఈచిత్రం కు రిలీజ్ కి ముందే ప్రభాస్ రిలాక్స్ అవడం కోసం విదేశాలకు వెళ్ళాడట. అయితే సినిమా నెగటివ్ టాక్ రావడంతో ఈసినిమా ఎట్టిపరిస్థితుల్లో బ్రేక్ ఈవెన్ కావాలని ప్రభాస్ తన ట్రిప్ ను అర్థాంతరంగా ముగించుకుని సడెన్ గా హైదరాబాద్ కు తిరిగి వచ్చాడని సమాచారం. సెకండ్ ఫేజ్ ప్రమోషన్స్ మొదలు పెట్టాలన్నా ప్రభాస్ ఉండడం తప్పనిసరి. అందుకే ఆయన తిరిగి వచ్చేసాడని తెలుస్తుంది. ఒకవేళ ఇదంతా నిజం అయితే మంగళవారం ప్రభాస్ మీడియా ముందుకు వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News