బాలయ్యకు అంత ఇవ్వాల్సిందేనా?

కథానాయకుడు, మహానాయకుడు సినిమాల ప్లాప్ తర్వాత బాలకృష్ణ తన రెమ్యునరేషన్ పెంచేశాడనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ హల్చల్ చేసింది. జై సింహ దర్శకుడు తో [more]

;

Update: 2019-10-29 08:29 GMT

కథానాయకుడు, మహానాయకుడు సినిమాల ప్లాప్ తర్వాత బాలకృష్ణ తన రెమ్యునరేషన్ పెంచేశాడనే టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ హల్చల్ చేసింది. జై సింహ దర్శకుడు తో రూలర్ సినిమా తో సెట్స్ మీదున్నాడు. సి కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న రూలర్ సినిమా డిసెంబర్ 20 న విడుదల డేట్ ఇవ్వడమే కాదు. ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ అంటూ హడావిడి కూడా మొదలెట్టేశాడు. బాలకృష్ణ తన రెమ్యునరేషన్ పెంచాడని, ఇప్పటివరకు 7 కోట్లు అందుకుంటున్న బాలకృష్ణ ఇప్పుడు డబుల్ చేశాడనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది.

నిర్మాతకు కంగారు..

రూలర్ సినిమా కోసం బాలకృష్ణ 14 కోట్లు డిమాండ్ చేస్తున్నాడనే న్యూస్ ఇప్పుడు హాట్ హాట్ గా ప్రచారంలో కొచ్చింది. యంగ్ అండ్ స్టార్ హీరోస్ కి కూడా అంత డిమాండ్ లేనప్పుడు బాలయ్య అంత డిమాండ్ చేస్తున్నాడనే సరికి రూలర్ నిర్మాత కళ్యాణ్ కంగారు పడుతున్నాడట. బాలకృష్ణ అడిగింది ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు గనక బాలయ్య అడిగిన 14 కోట్లు ఇవ్వడానికి రెడి అవుతున్నాడట. దాని కోసం నిర్మాత బడ్జెట్ లోనే మార్పులు చేస్తున్నాడట. తాను అనుకున్న బడ్జెట్ లోనే సినిమా పూర్తి కావాలని అందుకే బాలయ్య అడిగింది ఇవ్వడానికి మిగతా నటులు, టెక్నీషియన్స్ పారితోషికాల్లో కొత పెడుతున్నాడనే న్యూస్ మాత్రం అందరిని షాక్ కి గురిచేస్తుంది.

 

 

 

Tags:    

Similar News