Unstoppable : బాలయ్య అన్‌స్టాపబుల్‌కి బాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్..

బాలయ్య అన్‌స్టాపబుల్‌ షోకి బాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రాబోతున్నాడు. ఎవరో తెలుసా..?;

Update: 2023-11-12 06:08 GMT
Balakrishna, Unstoppable Season 3, Ranbir Kapoor guest,  Bollywood star hero
  • whatsapp icon

Unstoppable : బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో ప్రసారం అవుతున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్'. ఈ షో ఎంతటి పాపులారిటీని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా టు పొలిటికల్ రంగంలోని సంచలన వ్యక్తులను షోకి అతిథులుగా తీసుకు వచ్చి, వారిని సంచలన విషయాలను గురించి ప్రశ్నిస్తూ.. బాలయ్య ఆడియన్స్ కి థ్రిల్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఈ షో రెండు సీజన్స్ ని పూర్తి చేస్తుంది.

సీజన్ 1ని మోహన్ బాబుతో మొదలుపెట్టి మహేష్ బాబుతో ముగింపు పలికారు. సీజన్ 2ని చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేసి ప్రభాస్, పవన్ కళ్యాణ్‌తో ఎండ్ కార్డు వేశారు. ఈ రెండు సీజన్స్ కి రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్ వచ్చింది. ఇక ఇప్పుడు అభిమానులంతా సీజన్ 3 కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ ఏ స్టార్స్ అతిథులుగా రాబోతున్నారో అని అందరూ క్యూరియాసిటీతో వేచి చూస్తున్నారు.
ఇటీవల బాలయ్య భగవంత్ కేసరి సినిమా కోసం ఒక స్పెషల్ ఎపిసోడ్ చేసి సీజన్ 3ని మొదలుపెట్టారు. కాగా ఇప్పుడు ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ కోసం బాలీవుడ్ బడా హీరోని గెస్ట్ గా తీసుకు రాబోతున్నారు. బాలయ్య మీట్స్ బాలీవుడ్ అంటూ.. ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ రణబీర్ కపూర్ అని తెలియజేశారు. ప్రస్తుతం ఈ హీరో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో 'యానిమల్' అనే చేస్తున్నారు. డిసెంబర్ 1న ఇది రిలీజ్ కాబోతుంది.
ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే రణబీర్.. హీరోయిన్ రష్మిక, సందీప్ వంగాతో కలిసి ఈ షోలో పాల్గొనబోతున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు రానున్నాడు. టాలీవుడ్ టాక్ షోల్లో ఒక బాలీవుడ్ స్టార్ పాల్గొనడం ఇదే మొదటిసారి. అది కూడా బాలయ్య హోస్ట్ చేస్తున్న టాక్ షో కావడం మరి విశేషం. బాలయ్య, రణబీర్ ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు.
Full View


Tags:    

Similar News