బాలయ్య – రావిపూడి – దిల్ రాజు

ఈ జనరేషన్ డైరెక్టర్స్ హీరోగా బాలయ్య పొటన్షియాలిటీ అంటే ఏమిటో తెలిసి సరైన బ్లాక్ బస్టర్ బాలయ్యకి పడితే బాక్సాఫీసు దగ్గర ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని [more]

;

Update: 2021-03-10 11:21 GMT

ఈ జనరేషన్ డైరెక్టర్స్ హీరోగా బాలయ్య పొటన్షియాలిటీ అంటే ఏమిటో తెలిసి సరైన బ్లాక్ బస్టర్ బాలయ్యకి పడితే బాక్సాఫీసు దగ్గర ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని గ్రహించిన దర్శకులు, మరీ ముఖ్యంగా బాలయ్య సినిమాలు చూస్తూ బాలయ్య మాస్ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చిన ఈ జనరేషన్ దర్శకులు బాలయ్య తో పని చెయ్యడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే యంగ్ డైరెక్టర్స్ అయినా గోపీచంద్, అనిల్ రావిపూడి లాంటివాళ్లు బాలయ్యతో మూవీ చెయ్యడానికి రెడీ అయ్యారు.

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో BB3 చేస్తున్న విషయం తెలిసిందే. BB3 షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య ఈ జనరేషన్ డైరెక్టర్స్ తో వరసగా సినిమాలు లైనప్ సెట్ అవుతున్నాయి. క్రాక్ తో పెద్ద హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో బాలకృష్ణ BB3 తదుపరి చిత్రానికి కమిట్ అయిన విషయమూ తెలిసిందే. బాలయ్య – గోపీచంద్ కాంబో మూవీని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ తో అనిల్ రావిపూడి కాంబో సెట్ అయినట్లే. ఎందుకంటే అనిల్ రావిపూడి బాలకృష్ణ తో సినిమా చెయ్యాలని ఎప్పటినుండో అనుకుంటున్నాడు. ఎప్పుడో బాలయ్యకి కథ కూడా వినిపించాడట అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబో ఫిలిం ని దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించబోతున్నాడు.

Tags:    

Similar News