వీర సింహారెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్

తాజాగా చిత్రబృందం.. వీరసింహారెడ్డి విడుదల తేదీని ప్రకటించింది. జనవరి 12వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు..;

Update: 2022-12-03 11:54 GMT
veera simha reddy release date, sankranthi 2022 movies

veera simha reddy release date

  • whatsapp icon

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో.. ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ గా రూపొందుతోన్న సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ కనిపించనుంది. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇటీవలే తమన్ స్వరపరచిన జై బాలయ్య యాంథమ్ సాంగ్ విడుదలై.. అభిమానులను అలరించింది.

తాజాగా చిత్రబృందం.. వీరసింహారెడ్డి విడుదల తేదీని ప్రకటించింది. జనవరి 12వ తేదీన సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ.. పోస్టర్ ను రిలీజ్ చేశారు. వీరసింహారెడ్డి సంక్రాంతికి విడుదలవుతుందని తొలి నుండి చిత్రబృందం చెబుతూ వస్తోంది. కానీ.. సంక్రాంతి బరిలోకి వచ్చే సినిమాల సంఖ్య పెరుగుతుండటంతో.. ఈ సినిమాను విడుదల చేస్తారో లేదోనని అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. వాటికి అడ్డుకట్ట వేస్తూ.. విడుదల తేదీని ప్రకటించారు. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు.


Tags:    

Similar News