ఆ… మూవీకి..అక్కడ డిఫరెంట్ ప్రమోషన్
బెల్లంకొండ శ్రీనివాస్ కి కెరీర్ లో చెప్పుకోవడానికి సరైన హిట్ లేదు. కానీ అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ముందుకు వస్తున్నారు. [more]
;
బెల్లంకొండ శ్రీనివాస్ కి కెరీర్ లో చెప్పుకోవడానికి సరైన హిట్ లేదు. కానీ అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ముందుకు వస్తున్నారు. [more]
బెల్లంకొండ శ్రీనివాస్ కి కెరీర్ లో చెప్పుకోవడానికి సరైన హిట్ లేదు. కానీ అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ముందుకు వస్తున్నారు. అతని సినిమాలంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతాయి. ప్రమోషన్స్ కూడా అదే విధంగా జరుగుతాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఆయన లేటెస్ట్ మూవీ ‘రాక్షసుడు’ ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. అలానే యుఎస్ తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గ థ్రిల్లర్ మూవీ కావడంతో దీన్ని అక్కడి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది.
డిఫరెంట్ గా….
అమెరికాలో ఈ మూవీ ప్రమోట్ చేయడానికి డిఫరెంట్ గా ఆలోచించారు. రీసెంట్ గా ప్రమోషన్స్ కోసం అక్కడ ఓ జెట్ ప్లైట్ ని తీసుకుని దాన్ని ఫ్లోరిడా నగరంలోని బీచ్‌ల మీదుగా తిప్పుతూ ‘ఆల్ ద బెస్ట్ 2 బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు టీం’ అంటూ దానికో బేనర్‌ను ఎగరేయడం విశేషం. చాలా కొత్త ఆకర్షిస్తున్న ఈ కొత్త కాన్సెప్ట్ ప్రమోషన్ చూసి అక్కడ జనాలు సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. అలానే అమెరికాలో మిగతా ప్రధాన నగరాల్లోనూ ఈ ప్రమోషన్ కొనసాగిస్తున్నారట. మన స్టార్ హీరోస్ కి సైతం ఇటువంటి ప్రమోషన్స్ దొరకవు. కానీ బెల్లంకొండ కి దొరకడం అంటే ఆశ్చర్యకరమే.