ఆ హీరో కండలు చూసారా?
కవచం, సీత సినిమాల్తో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి చిత్రం రాక్షసుడు చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. తమిళ రచ్చసన్ [more]
;
కవచం, సీత సినిమాల్తో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి చిత్రం రాక్షసుడు చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. తమిళ రచ్చసన్ [more]
కవచం, సీత సినిమాల్తో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి చిత్రం రాక్షసుడు చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. తమిళ రచ్చసన్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ రాక్షసుడు సినిమా కోసం కండలు తిరిగిన బాడీ ని పెంచాడు బెల్లంకొండ హీరో శ్రీనివాస్. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ రాక్షసుడు సినిమా లో బెల్లంకొండ పోలీస్ గా కనిపించబోతున్నాడు. మాములుగా పోలిస్ అంటే… కండలు తిరిగిన బాడీ అవసరమే కానీ.. ఈ రాక్షసుడు చిత్రానికి హీరో మాత్రం ఫిట్ గా స్ట్రాంగ్ గా కనబడాలి. అప్పుడే కథతో పాటుగా హీరో కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. అందుకే శ్రీనివాస్ జిమ్ లో కష్టపడి కండలు పెంచాడు.
మరి ఈ రోజు విడుదలకాబోయే రాక్షసుడు టీజర్ ఎలా ఉండబోతుందో… కానీ శ్రీనివాస్ జిమ్ బాడీ కి సంబందించిన ఫొటోస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తమిళంలో అయితే బ్లాక్ బస్టర్ అయ్యింది. మరి తెలుగులో ఏ మేర హిట్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమా కూడా ప్లాప్ అయితే శ్రీనివాస్ హ్యాట్రిక్ ప్లాప్స్ కొట్టినట్టే అవుతుంది