ట్రైలర్ గ్రిప్పింగ్ గా ఉంది..మరి సినిమా?

తమిళంలో సూపర్ హిట్ అయినా `రచ్చాసన్` ను తెలుగు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా [more]

;

Update: 2019-07-19 07:51 GMT

తమిళంలో సూపర్ హిట్ అయినా 'రచ్చాసన్' ను తెలుగు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక శ్రీనివాస్ ఇందులో పోలీస్ అధికారిగా ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్నారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈమూవీని కే.ఎల్.యూనివర్శిటీ అధినేత కొనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈసినిమా వచ్చేనెల ఆగస్టు 2న అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

మొదట ఈసినిమాలో హీరోగా నలుగురైదుగురు పేర్లు అనుకుని చివరికి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ను ఎంచుకున్నారు డైరెక్టర్ రమేష్ వర్మ. రీమేక్ లు తీయడం అంటే చాలా కష్టం. మరి ఈ డైరెక్టర్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఇక ఈమూవీని దర్శకుడు రమేశ్ వర్మ చాలా ఛాలెంజింగ్ గా తీసుకుని 90 రోజుల్లోనే పూర్తి చేశారని వెల్లడించారు. అసలు కెరీర్ లో ఒక్క హిట్ కూడా లేని శ్రీనివాస్ కి ఈసినిమాతో అన్న తొలి విజయం అందుతుందేమో చూద్దాం. యాక్షన్ కథలు ఎంచుకుని డబ్బింగ్ రైట్స్ .. డిజిటల్ రైట్స్ అంటూ బాగానే బిజినెస్ చేసుకోవడం బెల్లంబాబుకే తెలిసిన టెక్నిక్. అందుకే మనోడికి సక్సెస్ లేకపోయినా మార్కెట్ ఉంది కాబట్టి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తున్నారు. సినిమా అవకాశాలు వస్తున్నాయి. మరి ట్రైలర్ లో చూపించిన మాదిరిగా సినిమా అంత గ్రిప్ గా ఉంటుందా? అనేది చూడాలి

Tags:    

Similar News