అందుకే ఇంత తొందరగా చుట్టేశారు
కవచం ప్లాప్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ అంటే స్పీడుగా సీత సినిమాని పూర్తి చేసి విడుదల చేస్త అది ప్లాప్ అయ్యింది. ఆ సినిమా విడుదలై ఇంకా [more]
;
కవచం ప్లాప్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ అంటే స్పీడుగా సీత సినిమాని పూర్తి చేసి విడుదల చేస్త అది ప్లాప్ అయ్యింది. ఆ సినిమా విడుదలై ఇంకా [more]
కవచం ప్లాప్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ అంటే స్పీడుగా సీత సినిమాని పూర్తి చేసి విడుదల చేస్త అది ప్లాప్ అయ్యింది. ఆ సినిమా విడుదలై ఇంకా నెల కాలేదు. ఈలోపే శ్రీనివాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రాక్షసుడు సినిమా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. అబ్బో బెల్లంకొండ శ్రీనివాస్ ఇంత స్పీడుగా ఉన్నాడేమిటి అనుకున్నారు. రచ్చసన్ తమిళ రీమేక్ ని తెలుగులో రమేష్ వర్మ రాక్షసుడుగా రీమేక్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తెలుగు షూటింగ్ చాలా స్పీడుగా జరిగిపోతుందని అంటున్నారు. స్పీడు గా కాదు.. చాలా చాలా స్పీడు గా… రాక్షసుడు షూటింగ్ అప్పుడే ముగింపు దశకు చేరుకుంది. మరింత ఫాస్ట్ గా రాక్షసుడు షూటింగ్ ని బెల్లంకొండ – రమేష్ వర్మ చేసారా అంటే? అనే దానికి సమాదానం ఇదే అంటున్నారు.
తమిళ రీమేక్ రచ్చసన్ లోని చాలా సీన్స్ ని తెలుగు రాక్షసుడులో పెట్టేశారట. అంటే ఈ సినిమాలో సగం వరకూ వర్జినల్ సీన్లే వాడుకున్నారట. మొన్న విడుదలైన రాక్షసుడు టీజర్లో కనిపించిన కొన్ని షాట్స్ చూసిన వారు తమిళ రచ్చసన్ ఒరిజినల్ సీన్స్ నే అనుకున్నారు. అది నిజమేనట. తమిళంలో నటించిన చాలామంది నటులు తెలుగు రాక్షసుడులో కూడా కనిపిస్తారు. ఆ నటీనటులతో చేయాల్సిన సన్నివేశాల్ని తమిళ రచ్చసన్ నుంచి యధావిధిగా తీసుకొచ్చేశారు. అయితే హీరో చేసిన కొన్ని సీన్లు మాత్రం మళ్లీ కొత్తగా తీశారంతే. అందుకే ఈ తెలుగు రీమేక్ అంత త్వరగా పూర్తయ్యింది. మరి రెండు సినిమాల వరస డిజాస్టర్స్ తో ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్ కి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఎలాగూ చాలా సీన్స్ ని తమిళం నుండి యధావిధిగా పెట్టేసారు కాబట్టి ఈ సినిమాకి పెద్దగా బడ్జెట్ కూడా అవడం లేదట. చాలా తక్కువ బడ్జెట్ తోనే ఈ సినిమా నిర్మితమవుతుందట. మరి బెల్లకొండ కెరీర్ లోనే ఈసినిమాకి అతి తక్కువ బడ్జెట్ పెట్టారట.