బిగ్ బాస్ కి సినిమా కష్టాలు!!

గత ఏడాది ఈపాటికి బుల్లితెర మీద బిగ్ బాస్ సీజన్ త్రీ సందడి మాములుగా లేదు. కేవలం శని ఆది వారాలే కాదు.. వర్కింగ్ డేస్ లోను [more]

Update: 2020-07-25 08:30 GMT

గత ఏడాది ఈపాటికి బుల్లితెర మీద బిగ్ బాస్ సీజన్ త్రీ సందడి మాములుగా లేదు. కేవలం శని ఆది వారాలే కాదు.. వర్కింగ్ డేస్ లోను బిగ్ బాస్ మంచి రేటింగ్ తో స్టార్ మా కి కిక్కిచ్చింది. నాగార్జున హోస్ట్ గా 100 రోజులకి పైగా బిగ్ బాస్ సీజన్ 3 లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ కాగా.. ఇప్పుడు సీజన 4 కోసం స్టార్ మా బాగా వెయిట్ చేస్తుంది. కానీ కరోనా వలన బిగ్ బాస్ యాజమాన్యానికి చుక్కలు కనబడుతున్నాయి. 100 రోజులు జరగాల్సిన షో కాస్త కేవలం 50 రోజులకే కుదించారని, నాగార్జున కండిషన్స్ కి తలొగ్గడమే కాదు.. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విషయంలోనూ బిగ్ బాస్ కి సినిమా కష్టాలు కనబడుతున్నాయట. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే వారు కరోనా టెస్ట్ లే కాకుండా 14 రోజులు బిగ్ బాస్ యాజమాన్యం ఏర్పాటు చేసే క్వారంటైన్ లో ఉండాలి.

అలాగే కంటెస్టెంట్స్ కి ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా చేయించాలనే కొత్త రూల్ ఒకటి బిగ్ బాస్ కి తగిలింది. కేవలం కంటెస్టెంట్స్ కి మాత్రమేనా షో కోసం పనిచేసే వారందరికీ అంటే దాదాపు 250 నుండి 275 మందికి ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం ఇన్సూరెన్స్ చేయించాలట. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ పారితోషకాల్లో కోత పెట్టినా…. నాగ్ పారితోషకం, సెట్ ఖర్చు మామూలుగానే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు కంటెస్టెంట్స్ కి టెక్నీకల్ సిబ్బందికి కొత్తగా ఇన్సూరెన్స్ ఒకటి బిగ్ బాస్ యాజమాన్యానికి తలా బొప్పికడుతుందట. గతంలో కన్నా ఖర్చు తగ్గిద్దామని డిసైడ్ అయితే.. ఇప్పడు ఈ ఇన్సూరెన్స్ గోలతో మరో 20 శాతం ఖర్చు ఎక్కువ అవుతుందట. ఏదో టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోదామని, కోట్లు కొల్లగొడదామని చూస్తే ఇప్పుడు బిగ్ బాస్ యాజమాన్యానికి కె బిగ్ బాస్ షో చుక్కలు చూపెడుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News