బిగ్ బాస్ కి వెళ్లొచ్చక బాగా పెంచేస్తున్నారు

ఏ సీజన్ లో లేని జోరు హోరు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ కి వుంది. సీజన్ 4 సభ్యుల దూకుడు మాములుగా లేదు. బిగ్ [more]

Update: 2021-02-24 10:41 GMT

ఏ సీజన్ లో లేని జోరు హోరు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ కి వుంది. సీజన్ 4 సభ్యుల దూకుడు మాములుగా లేదు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున చిరు వరాల జల్లుతో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ కి బాగానే క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ ముగిసాక సోహెల్ అనేక సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళుతుంటే.. అఖిల్ కొత్త మూవీ మొదలు పెట్టాడు. బిగ్ బాస్ క్రేజ్ తో మోనాల్ తో కొత్త సినిమా స్టార్ట్ చేసాడు. విన్నర్ అభిజిత్ ఇంకా లీడ్ లోకి రాలేదు. అయితే బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చాక అవినాష్, అరియనాలతో స్టార్ మా క్యాష్ చేసుకుందామని.. ఏవేవో గేమ్ షోస్ ప్లాన్ చేసి ఏదేదో కామెడీ చేస్తుంది.

బిగ్ బాస్ కి వెళ్ళొచ్చాం దానికే క్రేజ్ వచ్చేసింది అంటూ పారితోషకాలు పెంచేస్తే.. ఇచ్చేస్తారా? మరి అరియనా రోజుకి లక్ష డిమాండ్ అంటూ ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ లో అరుపులు కేకలతో, గ్లామర్ షో అంటూ బాగా హైలెట్ అయిన అరియనా కి బిగ్ బాస్ తర్వాత సినిమా ఆఫర్స్ వస్తున్నాయ్, రాజ్ తరుణ్ మూవీలో చేస్తుంది అని అంటున్నారు. తాజాగా అరియనాని ఓ మూవీ యూనిట్ రెండు రోజుల డేట్స్ కోసం సంప్రదించగా 2 లక్షలు డిమాండ్ చేసిందట. కానీ ఆ యూనిట్ అరియనా కాళ్ళ వేళ్ళ పడి 50 వేలకి ఒపించారట. మరి బిగ్ బాస్ లో బాగా ఇచ్చారు కదా అని, బయట కూడా అదే రేంజ్ పారితోషకాలు డిమాండ్ చేస్తే .. వాళ్ళని పక్కన పెట్టడం ఎంతసేపు. అది గమనిస్తే కెరీర్ బావుంటుంది.

Tags:    

Similar News