ఫిట్టింగ్ తోనే కిస్సింగ్

బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అయ్యి 50 రోజులు పూర్తయ్యింది. ఇంకా మిగిలింది 50 రోజులు మాత్రమే. అందుకేనేమో బిగ్ బాస్ కూడా టాస్కులు కఠినంగా [more]

;

Update: 2019-09-17 07:25 GMT

బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ట్ అయ్యి 50 రోజులు పూర్తయ్యింది. ఇంకా మిగిలింది 50 రోజులు మాత్రమే. అందుకేనేమో బిగ్ బాస్ కూడా టాస్కులు కఠినంగా ఇస్తున్నాడు. నిన్న సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఒకరిని సేవ్ చేయడానికి మరొకర్ని ఏదో ఒకటి త్యాగం చేయమనడం అనేది కండీషన్. మొదట శ్రీముఖి కోసం బాబా భాస్కర్ గడ్డం, మీసం(క్లీన్ షేవ్) తీయాల్సి వచ్చింది. ఆ తరువాత శివ జ్యోతి కోసం మహేష్ తన హెయిర్ కి రెడ్ కలర్ వేసుకున్నాడు. వరుణ్ సందేశ్ కోసం శ్రీముఖి టాటూ వేసుకుంది. అలానే హిమజాను సేవ్ చేయడానికి వరుణ్ సందేశ్ పేడతొట్టిలో పడుకున్నాడు. ఇలా కఠినంగా కండిషన్స్ పెట్టి ఒకరిపై ఒక్కరికి ఎంత ప్రేమ ఉందో తెలిసేలా చేసాడు బిగ్ బాస్.

ఫిట్టింగ్ ల బిగ్ బాస్ ….

కొన్ని మిస్ అండర్ స్టాండింగ్స్ మధ్య దూరంగా ఉన్న పునర్నవి, రాహుల్ కి ఫిట్టింగ్ బాగానే పెట్టాడు బిగ్ బాస్. పునర్నవిని సేవ్ చేయడం కోసం రాహుల్ 20 గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ను తాగాలి. అది రాహుల్ చాలా అవలీలగా తాగేశాడు. 20 గ్లాసులు తాగినవెంటనే రాహుల్ విజయగర్వంతో పునర్నవి వద్దకు రాగానే.. రాహుల్‌ను పునర్నవి గట్టిగా హత్తుకుని బుగ్గపై ఓ ముద్దు పెట్టింది. ఈ సీన్ ఆ ఎపిసోడ్ కి హైలైట్ అయింది. ప్రస్తుతం ఈ కిస్ గురించి సోషల్ మీడియా లో రకరకాల మీమ్స్ అండ్ ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఇక ఈ రోజు ఎపిసోడ్ ప్రోమో ప్రకారం రాహుల్ సేవ్ చేయడానికి పునర్నవి సీజన్ మొత్తం నామినేట్ అవ్వాల్సి ఉంటుంది. మరి పునర్నవి అందుకు ఒప్పుకుందో లేదో చూడాలి. ఇలా వారిద్దరి మధ్య ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్.

 

Tags:    

Similar News