Pallavi Prashanth: బ్రేకింగ్.. బెయిల్ వచ్చింది

బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు బెయిల్;

Update: 2023-12-22 12:28 GMT
biggboss, pallaviprashanth, prashanthpallavi, biggbosstelugu, biggboss news, movie news,  pallavi prashanth got bail

 pallavi prashanth got bail

  • whatsapp icon

బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బిగ్ బాస్ లో విన్నర్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద నానా రచ్చ జరిగింది. ఈ ఘటనలో పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేశారు. ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్టు చేయడంతో పాటు.. పల్లవి ప్రశాంత్అతని సోదరుడిని కూడా అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పల్లవి ప్రశాంత్ న్యాయవాది బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో నిన్న వాదప్రతివాదనలు ముగిసాయి. ఈరోజు నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.అతని సోదరుడికి సైతం బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా నాంపల్లి కోర్టు ఏ -1 నుండి ఏ -4 వరకు బెయిల్ మంజూరు చేసింది. పల్లవి ప్రశాంత్ ఎక్కడ కూడా సమావేశాలు, మీడియా తో మాట్లాడకూడదని, ఆదివారం పోలీసుల ముందు విచారణ నిమిత్తం హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.


Full View


Tags:    

Similar News