విజయ్ తో సినిమా చెయ్యాలనుంది

Update: 2018-11-26 07:25 GMT

మొన్నామధ్యన విజయ్ దేవరకొండ సరసన అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటించబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. తాజాగా రాజమౌళి కూడా బాహుబలిలో శ్రీదేవిని మిస్ అయ్యాము.. ఈసారి ఆమె కూతురు జాన్వీని తన #RRR లో తీసుకునే ఆలోచన చేస్తున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినబడినది. అయితే జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ వైపు చూసే ఆలోచన ఉన్నట్లుగా కనబడలేదు. బాలీవుడ్ లో నిలదొక్కుకున్నాకే ఆమె సౌత్ బాట పట్టాలనుకుంటున్నట్లు ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది. కానీ జాన్వీ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో వీర లెవల్లో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా ఆమె ఒక షోలో చెప్పిన సమాధానం బట్టి తెలుస్తుంది.

విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని...

జాన్వీ కపూర్ తాజాగా అన్న కాని అన్న అర్జున్ కపూర్ తో కలిసి బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షోకి హాజరైంది. అయితే ఆ షోలో కరణ్ జోహార్ జాన్వీని కొన్ని ప్రశ్నలడుగుతూ మధ్యలో ఒకవేళ నువ్వో రోజు ఓ మేల్ యాక్ట‌ర్‌గా నిద్ర లేస్తే… ఎవరిలా మేల్కోవాలని అనుకుంటావు..? ఎందుకు..? అంటూ ప్రశ్నించగా... దానికి జాన్వీ కపూర్ ఏ మాత్రం తడుముకోకుండా విజయ్ దేవరకొండలా నిద్రలేచి నాతో సినిమా చేస్తా అంటూ చెప్పింది. మరి జాన్వీ సమాధానం చూస్తుంటే... విజయ్ దేవరకొండపై జాన్వీ చూపు గట్టిగా పడిందనిపిస్తుంది. త్వరలోనే విజయ్ తో సినిమా అవకాశం వస్తే బాగుండుననేలా ఉంది జాన్వీ సమాధానం చూస్తుంటే.

బాలీవుడ్ లో విజయ్ క్రేజ్

మరి బాలీవుడ్ లోనూ విజయ్ దేవరకొండ క్రేజ్ కి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటికే విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాని షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి తోనే పలు భాషా ఇండుస్త్రీలను తనవైపు తిప్పేసుకున్నాడు విజయ్ దేవరకొండ. మరి జాన్వీ కపూర్ కోరిక మేరకు విజయ్ దేవరకొండ - జాన్వీ కలిసి అతి త్వరలోనే కలిసి ఒక సినిమా చేస్తే ఆ క్రేజ్, ఆ అంచనాలు మరే సినిమాకి ఉండవనే చెప్పాలి.

Similar News