బోయపాటి ఎంతగా క్లాస్ టైటిల్స్ పెట్టినప్పటికీ.. అటు తిరిగి ఇటు తిరిగి సినిమాలో మాస్ అండ్ యాక్షన్ కే ఇంపార్టెన్స్ ఇచ్చాడనేది జయ జానకి నాయకలో అర్ధమైంది. తాజాగా రామ్ చరణ్ తో కూడా వినయ విధేయ రామ అంటూ టైటిల్ పెట్టాడు కానీ.. సినిమాలో ఊర మాస్ ఉందనేది వినయ విధేయ రామ ఫస్ట్ లుక్ లోనే తేలిపోయింది. బోయపాటి ఎందుకు మారతాడు అంటూ... అందరూ రామ్ చరణ్ వినయ విధేయ రామ కూడా పక్కా మాస్ మూవీ అని ఫిక్స్ అయ్యారు కూడా. అయితే బోయపాటి ఇపుడు వదులుతున్న లుక్స్ తో ప్రేక్షకులను పక్కదారి పట్టిస్తున్నాడనిపిస్తుంది. ఫస్ట్ లుక్ లో, టీజర్ లో రామ చరణ్ ని ఊర మాస్ గా చూపించిన బోయపాటి కార్తీక పౌర్ణమి రోజు రామ్ చరణ్ స్టైలిష్, ట్రెడిషనల్ లుక్ ని వదిలాడు.
క్లాస్ సినిమాగా చెప్పేందుకే...
అలాగే తాజాగా రామ్ చరణ్ క్లాసీ లుక్ లో అమ్మాయిలతో సరదాగా గడుపుతున్న పిక్ ఒకటి వదిలాడు. అంటే దీన్నిబట్టి బోయపాటి వినయ విధేయ రామతో క్లాస్ బిల్డప్ ఇస్తున్నాడనిపిస్తుంది. రామ్ చరణ్ కూల్ అండ్ స్టైలిష్ గా ఉన్న లుక్స్ తోనే ఫామిలీ ఆడియన్స్ అందరినీ ఇంప్రెస్స్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టేసాడు. వినయ విధేయ రామ సాఫ్ట్ టైటిల్ కి తగ్గ లుక్స్ వదులుతున్నాడు అని అంటున్నారు. చూద్దాం బోయపాటి - రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాలో ఎన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయో... అలాగే ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అనేది ట్రైలర్ వచ్చే వరకు ఆగితే సరిపోతుంది.