హీరో నాగార్జున సోదరిపై కేసు నమోదు
హీరో నాగార్జున సోదరిపై కేసు నమోదు చేశారు. భూమి;
హీరో నాగార్జున సోదరిపై కేసు నమోదు చేశారు. భూమి వ్యవహారంలో నాగ సుశీల పై పోలీసులు కేసు నమోదు చేశారు. చింతల పూడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు పై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగ సుశీల పై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. నాగ సుశీల తో పాటు 12 మంది కలిసి తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.. శ్రీ నాగ్ ప్రొడక్షన్ పార్టనర్ గా కొనసాగిన చింతలపూడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతం లోనూ చింతలపూడి శ్రీనివాస్ నాగ సుశీల, శ్రీనివాస్ ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు కేసులు చేసుకున్నారు. తనకు తెలియకుండా భూమి విక్రయించారని గతంలో శ్రీనివాస్ పై సుశీల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమంపై నాగసుశీల తో పాటు మరికొందరు దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది. నాగసుశీల, శ్రీనివాస్ కలిసి గతంలో పలు చిత్రాలను నిర్మించడంతో పాటు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వీరి మధ్య కొన్నేళ్లుగా భూవివాదం ఉంది. తనను జైలుపాలు చేసైనా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకోవడానికి తనపై నాగసుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగసుశీల తనయుడు సుశాంత్‌తో నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామన్నారు.