నటి సంయుక్త సంచలన ఆరోపణలు

Update: 2023-06-04 04:03 GMT
నటి సంయుక్త సంచలన ఆరోపణలు
  • whatsapp icon

కోలీవుడ్‌ బుల్లితెర జంట సంయుక్త- విష్ణుకాంత్‌ల విడిపోయారు. ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ రెండు నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించారు. నటి సంయుక్త విష్ణుకాంత్ పై సంచలన ఆరోపణలు చేసింది. సంయుక్త తన మాజీ ప్రియుడిని ఇంకా మర్చిపోలేదని, తనకు గతంలో ఒక లవ్‌ స్టోరీ ఉందన్న విషయాన్ని కూడా చెప్పలేదంటూ విష్ణు కాంత్ పెట్టిన ఆడియో వైరల్‌ అవడంతో సంయుక్తపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తానే తప్పూ చేయలేదని, విష్ణుకాంతే తనకు నరకం చూపించేవాడని ఆరోపిస్తోంది సంయుక్త. అడల్ట్‌ వీడియోలు చూడమని బలవంతం చేసేవాడని, తనతో హింసాత్మకంగా ప్రవర్తించేవాడని చెబుతోంది. బెడ్‌రూమ్‌లో కెమెరా పెట్టి అన్నింటినీ రికార్డు చేయడానికి ప్రయత్నిస్తే దాన్ని నేను ఒప్పుకోలేదని చెప్పుకొచ్చింది. తనను భార్యగా కాకుండా వ్యభిచారిలా చూశాడని ఆరోపించింది.

విష్ణుకాంత్ ఇటీవల విడుదల చేసిన వీడియోలో, అతను సంయుక్త ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. ఆమె సత్యాన్ని వక్రీకరిస్తోందని ఆరోపించారు. తన తప్పులను దాచడానికి అబద్ధాలు చెబుతోంది. తన నిజ స్వభావాన్ని బహిర్గతం చేయడానికి ప్రయత్నించే ఎవరినైనా ఆమె నిందిస్తోందని అన్నారు. అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమె మాటలను నమ్మకండని విష్ణుకాంత్ ప్రజలను కోరారు.. తనను తాను రక్షించుకోవడానికి నా మీద నిందలు మోపుతోంది. తను చెప్పేది నిజమైతే అందుకు తగ్గ సాక్ష్యాలు చూపించాలిగా అని ప్రశ్నించారు. నేను శారీరకంగా, లైంగికంగా టార్చర్‌ పెట్టానంటోంది. మరి చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తుంది అని అన్నారు.


Tags:    

Similar News