ఓ బేబీ చూసి చైతు ఏమన్నాడంటే..
తమిళంలో ‘సూపర్ డీలక్స్’, తెలుగులో ‘ మజిలీ ‘ సినిమాలతో వరస విజయాలు అందుకున్న అక్కినేని సమంత లేటెస్ట్ గా ‘ఓ బేబీ’ అనే చిత్రం చేసింది. [more]
;
తమిళంలో ‘సూపర్ డీలక్స్’, తెలుగులో ‘ మజిలీ ‘ సినిమాలతో వరస విజయాలు అందుకున్న అక్కినేని సమంత లేటెస్ట్ గా ‘ఓ బేబీ’ అనే చిత్రం చేసింది. [more]
తమిళంలో ‘సూపర్ డీలక్స్’, తెలుగులో ‘ మజిలీ ‘ సినిమాలతో వరస విజయాలు అందుకున్న అక్కినేని సమంత లేటెస్ట్ గా ‘ఓ బేబీ’ అనే చిత్రం చేసింది. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన్న ఈసినిమా లో సామ్ భిన్నమైన రోల్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయినా ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.
ట్రైలర్ వినోదాత్మకంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. సామ్ కి సపరేట్ మార్కెట్ ఉంది కాబట్టి ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని టాక్. అయితే సామ్ చేసే ప్రతి చిత్రం రిలీజ్ కి ముందుగానే చూసే తన భర్త నాగ చైతన్య ఈచిత్రాన్ని కూడా రిలీజ్ కి ముందే చూశాడట.
ఈసినిమా చూస్తున్న అంత సేపు చైతు బాగా ఎంజాయ్ చేశాడట. సినిమా బాగుందని కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడట. అంటే సమంత చెప్పిన్నట్టు సినిమాలో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు బాగానే ఉన్నాయని అర్థమవుతోంది. జులై 5 న ఈమూవీ రిలీజ్ అవుతుంది. ఇది ఒక కొరియన్ మూవీకి రీమేక్ గా వస్తుంది. ఇక ఈచిత్రాన్ని సురేష్ బాబు, సునీతా తాటి సంయుక్తంగా నిర్మించారు. సామ్ ప్రస్తుతం 96 మూవీ రీమేక్ లో నటిస్తుంది.