పూరీ ఛార్మికి అంత హెల్ప్ చేస్తున్నాడా..?

డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ప్రస్తుతం రామ్ తో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తీస్తున్నాడు. ఈసినిమాకి  ఛార్మి కూడా వన్ అఫ్ ది ప్రొడ్యూసర్. పూరి గత కొన్ని సినిమాల [more]

Update: 2019-01-27 06:23 GMT
డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ప్రస్తుతం రామ్ తో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తీస్తున్నాడు. ఈసినిమాకి ఛార్మి కూడా వన్ అఫ్ ది ప్రొడ్యూసర్. పూరి గత కొన్ని సినిమాల నుండి ఛార్మి సహ నిర్మాత గా వ్యవరిస్తుంది. సినిమాకు సంబంధించి ఏం కావాలో, బడ్జెట్ ఎంత పెట్టాలో ఛార్మినే డిసైడ్ చేస్తుందట.
ఆర్టిస్టుల పారితోషికాల నుంచి ప్రొడక్షన్‌ సప్లయిస్‌ వరకు అన్నీ ఛార్మి చేతుల మీదుగా వెళుతున్నాయట. ఎవరికి ఎంతవు ఇవ్వాలో కూడా ఛార్మినే చెబుతుందట. అయితే తాజా సమాచారం ఛార్మి ఈసినిమాలో ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేదని టాక్. కారణం ‘మెహబూబా’ చిత్రంలో ఛార్మి ఆరు కోట్ల వరకు ఇన్వెస్ట్‌ చేసి మొత్తం పోగొట్టుకుంది. దానిని కాంపన్సేట్‌ చేయడానికి ఈ చిత్రానికి ఆమెకి కూడా నిర్మాణ భాగస్వామ్యాన్ని పూరి జగన్నాథ్‌ సమాచారం.
మెహబూబా విషయంలో పూరి బడ్జెట్ ని కంట్రోల్ చేయలేకపోయాడు. కొడుకు సినిమా కాబట్టి ఎక్కడ కంప్రమైజ్ కాకూడదని ఇలా చేసాడు. కానీ ఏం లాభం కంటెంట్ లో పస ఉండాలి కానీ. సో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హిట్ అవ్వడం ఛార్మి, పూరి, రామ్ కి చాలా అవసరం.
Tags:    

Similar News