సమంతకు మెగా భరోసా.. ట్వీట్ చేసిన చిరంజీవి

సమంత ఆరోగ్యం గురించి తెలుసుకున్న చిరంజీవి.. తన ట్విట్టర్ ఖాతా నుండి ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు..;

Update: 2022-10-30 13:06 GMT
sam jam, chiranjeevi tweet, samantha health

chiranjeevi samantha

  • whatsapp icon

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు నిన్న సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్ తో.. సమంత అభిమానులతో పాటు.. ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ నాని, ఎన్టీఆర్, అఖిల్, బండ్ల గణేష్, తమన్ లు సమంతకు ధైర్యమిస్తూ.. పోస్టులు చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ లిస్టులో చేరారు.

తాజాగా.. సమంత ఆరోగ్యం గురించి తెలుసుకున్న చిరంజీవి.. తన ట్విట్టర్ ఖాతా నుండి ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ''సమయం మారుతున్నకొద్దీ మన జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి. మనలోని శక్తిని బయటపెట్టేందుకు ఇవి వస్తాయి. నువ్వు చాలా మంచి అమ్మాయివి.. నీలో ఉన్న శక్తి అద్భుతమైనది. నువ్వు ఈ ఛాలెంజ్‌ను ఖచ్చితంగా నెగ్గుకొస్తావని నాకు నమ్మకం. నువ్వు ధైర్యంగా, పట్టుదలతో ఉండాలని కోరుతున్నాను..'' అంటూ భరోసా ఇచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
చిరంజీవి-సమంత కలిసి ఏ సినిమా చేయలేదు కానీ.. గతంలో ఆహా ఓటీటీలో వచ్చిన సామ్ జామ్ టాక్ షో లో చిరంజీవి గెస్టుగా విచ్చేశారు.







Tags:    

Similar News