నయన్ కి కష్టమేనా

కోలీవుడ్లో టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్న నయనతార తెలుగులోనూ సీనియర్ హీరోస్ సినిమాలో నటిస్తుంది. భారీ పారితోషకాన్ని తెచ్చుకునే నయన్ సినిమా షూటింగ్స్ కి తప్ప సినిమా [more]

Update: 2019-10-14 07:20 GMT

కోలీవుడ్లో టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్న నయనతార తెలుగులోనూ సీనియర్ హీరోస్ సినిమాలో నటిస్తుంది. భారీ పారితోషకాన్ని తెచ్చుకునే నయన్ సినిమా షూటింగ్స్ కి తప్ప సినిమా ప్రమోషన్స్ కి రాదనేది తెలిసిందే. గతంలో దర్శకుడు మారుతీ, నయనతార మీద సంచల వ్యాఖ్యలు చేశాడు. బాబు బంగారం సినిమా షూటింగ్ సమయంలో వెంకీ లొకేషన్స్ కి వచ్చినప్పుడు నయనతార కుర్చీలో నుంచి కూడా లేవలేదు. ఓ సీనియర్ హీరో కి నయన్ రెస్పెక్ట్ ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యాడు. తాజాగా చిరంజీవి సైరా సినిమా కోసం ఆరు కోట్లిచ్చి తీసుకొస్తే ఒక్క ప్రమోషన్స్ కి కూడా నయన్ హాజరు కాలేదు.

కనుమరుగేనా….?

ఆమె డిమాండ్ ని బట్టి చాలామంది దర్శక నిర్మాతలు ప్రమోషన్స్ కి నయన్ రాకపోయినా లైట్ తీసుకుంటున్నారు. కానీ తాజాగా రామ్ చరణ్ బ్రతిమాలినా సైరా ప్రమోషన్స్ కి రాని నయనతారకి టాలీవుడ్ లో ఇక అవకాశాలు కష్టమే అంటున్నారు. ఆమెకి అడిగిన పారితోషకం ఇచ్చి ఇలా అడుక్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలెవరూ నయన్ కి అవకాశం ఇచ్చే అవకాశం లేనట్టుగా ఫిలింనగర్ టాక్.

 

Tags:    

Similar News