చరణ్ కి పెద్ద సమస్యే వచ్చిపడింది

మరో కొన్ని రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం రిలీజ్ కాకపోతుంది. భారీ అంచనాలు, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈమూవీ చుట్టూ ఓ చిక్కు [more]

Update: 2019-09-22 09:32 GMT

మరో కొన్ని రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం రిలీజ్ కాకపోతుంది. భారీ అంచనాలు, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈమూవీ చుట్టూ ఓ చిక్కు నడుస్తూనే ఉంది. ఉయ్యాల‌వాడ వంశానికి చెందిన ఐదో త‌రం కుటుంబీకులు న‌ర‌సింహారెడ్డిపై సినిమా తీసినందుకు త‌మ‌కు రాయ‌ల్టీ ఇవ్వాల‌ని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. వీరు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులు కిందట హైదరాబాద్ లో రామ్ చరణ్ ఆఫీస్ వద్ద వీరు ధర్నాకు దిగారు. అప్పుడు రామ్ చరణ్ దీనిపై ఏమి స్పందించలేదు

అప్పుడు తాత్కాలికంగా గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది కానీ ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతున్న టైములో ఉయ్యాల‌వాడ కుటుంబానికి చెందిన పాతిక మంది దాకా సైరా నిర్మాత చ‌ర‌ణ్ మీద హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. వీరందరికి కలిపి 50 కోట్లు ఇవ్వాలని వారి డిమాండ్. అసలే ఈసినిమాకి బడ్జెట్ తడిసి మోపెడు అయింది. ఇప్పుడు ఇంకో సమస్య వచ్చిపడింది. న‌ర‌సింహారెడ్డి జీవితం గురించి పూర్తి స‌మాచారం అందించింది తామే అని.. పైగా త‌మ గ్రామంలో చిత్రీక‌ర‌ణ కూడా జ‌రిపార‌ని.. ఆ స‌మ‌యంలో త‌మ పంట‌లు కూడా దెబ్బ తిన్నాయ‌ని వాళ్లు అంటున్నారు.

అప్పుడు చరణ్ వాళ్లకు నష్టపరిహారం చేస్తాం అని చెప్పారని..కానీ ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదని.. వారు ఫిర్యాదు చేసారు. రీసెంట్ గా రామ్ చరణ్ ట్రైలర్ లాంచ్ లో మాట్లాడుతూ…ఉయ్యాల‌వాడ గ్రామానికి సాయం చేస్తాం త‌ప్ప ఆయ‌న కుటుంబీకుల‌కు డ‌బ్బులివ్వ‌డం జ‌ర‌గ‌ద‌ని తేల్చి చెప్పాడు. మరి ఇప్పుడు ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News