దిల్ రాజు ఇలా చేశాడేంటి..?

మరో రెండు రోజుల్లో ‘మహర్షి’ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ సినిమాకి వంశీ పైడిపల్లి విపరీతంగా ఖర్చు చేయించేశాడని…బడ్జెట్ హద్దులు దాటిపోయిందని…భారీగా బిజినెస్ జరిగినా నిర్మాతలకి [more]

;

Update: 2019-05-07 09:05 GMT

మరో రెండు రోజుల్లో ‘మహర్షి’ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ సినిమాకి వంశీ పైడిపల్లి విపరీతంగా ఖర్చు చేయించేశాడని…బడ్జెట్ హద్దులు దాటిపోయిందని…భారీగా బిజినెస్ జరిగినా నిర్మాతలకి ఏమీ మిగలేదని టాలీవుడ్ లో పెద్ద‌ చర్చ నడుస్తుంది. అయితే ఈ విషయంపై మహేష్ బాబు కూడా స్పందించాడు. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో మహేష్ సైతం ఈ విషయాన్ని అంగీకరించాడు. ఓవర్ బడ్జెట్ అయిన మాట వాస్తవమ‌ని.. వసూళ్లు వస్తాయా అనేే విషయంలో కొంచెం టెన్షన్ ఉందని నిజాయితీగా చెప్పుకొచ్చాడు.వంశీ గత చిత్రం ‘ఊపిరి’కి కూడా బడ్జెట్ హద్దులు దాటిపోయింది. టాక్ పరంగా హిట్ అనిపించుకుంది కానీ ఓవర్ బడ్జెట్ అవ్వడంతో చివరికి కాస్ట్ ఫెయిల్యూర్ అనిపించుకుంది.

దిల్ రాజు ఏం చేశారు..?

అయితే ‘మహర్షి’ విషయంలో కొంచం జాగ్రత్త పడతారు అని అనుకుంటే మరింత ఎక్కువ ఖర్చు చేయించాడు. ఈ సినిమాకి ముగ్గురు నిర్మాతలు. పీవీపీ, అశ్విని దత్, దిల్ రాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే వీరిలో దిల్ రాజు ఒక్కరే యాక్టీవ్ గా ఉన్నారు. మిగిలిన ఇద్దరు పైపైనే చూసుకున్నారు. మొత్తం నిర్మాణం అంతా రాజు చేతుల మీదుగానే జరిగింది. ప్రొడక్షన్ విషయంలో దిల్ రాజు ఎంత పక్కాగా ఉంటారో మనకి తెలిసిన విషయమే. అయినా బడ్జెట్ హద్దులు దాటిపోయింది. దిల్ రాజుకి పెద్ద పెద్ద స్టార్లు, దర్శకులతో సినిమాలు తీసిన అనుభవం ఉంది. అతనికి బడ్జెట్ కంట్రోల్ చేయడం బాగా తెలుసు. కానీ ‘మహర్షి’కి మరీ ఎక్కువ ఖర్చయింది. వ్యవహారం చేతులు దాటిపోయింది. మరి ఇక్కడ దిల్ రాజు అనుభవం ఏమైంది.. వంశీ అలా బడ్జెట్ హద్దులు దాటించేస్తుంటే ఆయన ఎలా చూస్తూ ఊరుకున్నాడో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా ‘మహర్షి’ సూపర్ హిట్ అయితేనే ప్రొడ్యూసర్స్ కి ఏమైనా మిగిలే అవకాశముంది.

Tags:    

Similar News