క్రిష్ గాలానికి ఏ హీరో పడతాడో..?

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు, బాలీవుడ్ మణికర్ణిక దెబ్బకి అడ్రెస్స్ లేకుండా పోయాడు క్రిష్. మణికర్ణిక అయినా క్రిష్ పరువు నిలబెడుతుంది అనుకుంటే మణికర్ణిక క్రెడిట్ మొత్తం [more]

Update: 2019-04-04 07:19 GMT

ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు, బాలీవుడ్ మణికర్ణిక దెబ్బకి అడ్రెస్స్ లేకుండా పోయాడు క్రిష్. మణికర్ణిక అయినా క్రిష్ పరువు నిలబెడుతుంది అనుకుంటే మణికర్ణిక క్రెడిట్ మొత్తం కంగనా పట్టుకుపోయింది. ఇక టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ చెత్త క్రెడిట్ మొత్తం క్రిష్ ఖాతాలోకే చేరింది. అందుకే గత రెండు నెలలుగా క్రిష్ అజ్ఞాతవాసం చేస్తున్నాడు. అయితే ఈలోపు క్రిష్ ఒక బాలీవుడ్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడని.. ఆ సినిమా స్క్రిప్ట్ లో క్రిష్ తలమునకలై ఉన్నాడనే టాక్ వినబడే సరికి బాలీవుడ్ లో మణికర్ణికతో ఎదురుదెబ్బ తిన్న క్రిష్ మళ్లీ అక్కడే నిలదొక్కుకునే ప్రయత్నాలు మొదలుపెడుతున్నాడని అన్నారు.

ముందు టాలీవుడ్ లోనే…

అయితే బాలీవుడ్ కన్నా ముందుగా టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో సినిమా చెయ్యాలని క్రిష్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ని మొదలు పెట్టాడని అంటున్నారు. తన దగ్గర కథ పూర్తి స్థాయిలో సిద్ధమైతే.. ఆ కథతో ఓ స్టార్ హీరోని కలవడానికి క్రిష్ రెడీ అవుతున్నాడని.. అయితే స్క్రిప్టు ప‌నులు ఓ కొలిక్కి రావ‌డానికి క‌నీసం నెల రోజులైనా ప‌డుతుంద‌ని తెలుస్తోంది. మరి స్క్రిప్ట్ పూర్తయ్యాకే క్రిష్ తన హీరో ఎవరు అనేది రివీల్ చేస్తాడంటున్నారు. రెండు సినిమాల డిజాస్టర్స్ తో ఉన్న క్రిష్ గాలానికి ఏ స్టార్ హీరో చిక్కుతాడో అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.

Tags:    

Similar News