నటి జయసుధ పై ఆర్జీవీ ప్రశంసలు
2014లో జయసుధ - మోహన్ బాబులతో రౌడీ సినిమాను తీశారు. ఆ తర్వాత జయసుధ నటించిన మనీ, మనీ మనీ సినిమాలను కూడా నిర్మించారు.;
హైదరాబాద్ : దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి భక్తుడైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు.. సహజనటి జయసుధ కూడా అంతే అభిమానం, ఇష్టం ఉన్నాయి. ఓ సినిమా పోస్టర్ పై ఉన్న జయసుధను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోయారట. 'శివరంజని' సినిమాలో జయసుధ చేత కన్నీరు పెట్టించినందుకు మోహన్ బాబుపై ద్వేషం కూడా పెంచుకున్నారట. అంతలా ఆరాధిస్తారు ఆమెను. ఆర్జీవీ జయసుధను హీరోయిన్ గా పెట్టి పలు సినిమాలు కూడా తీశారు.
2014లో జయసుధ - మోహన్ బాబులతో రౌడీ సినిమాను తీశారు. ఆ తర్వాత జయసుధ నటించిన మనీ, మనీ మనీ సినిమాలను కూడా నిర్మించారు. తాజాగా జయసుధ ఓ పాట పాడగా.. అది విన్న ఆర్జీవీ ఆమెను పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. ఇటీవల జయసుధ దైవపుత్రుడు అనే క్రైస్తవ గీతాన్ని ఆలపించారు. ఈ గీతాన్ని వర్మ ట్విట్టర్లో షేర్ చేస్తూ.. 'జయసుధగారూ, మీరు పాడిన పాట వింటే విశ్వాసం లేని వారు కూడా విశ్వాసులుగా మారిపోతారు' అని ట్వీట్ చేశారు.