వీధికుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై ఆర్టీవీ ఆగ్రహం
అలాగే మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ.. "సార్..దయచేసి మొత్తం 5 లక్షల కుక్కలను డాగ్ హోమ్‌గా మార్చండి. అందులో మేయర్ గద్వాల;
ఐదురోజుల క్రితం (ఫిబ్రవరి 19)అంబర్ పేటలోని ఓ ఏరియాలో వీధికుక్కలు నాలుగేళ్ల బాలుడిని కరిచి చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై కనీసం కనికరం లేకుండా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. “హృదయాన్ని కదిలించే ఈ వీడియోను హైదరాబాద్ మేయర్ గద్వాల విజయకు పదేపదే చూపించాల్సిన అవసరం ఉంది. ఆమె తన సూపర్ డంబ్ సూచనలపై ఆమె నోరు విప్పే ముందు .. ఆమెనే నిజమైన ప్యాక్ లీడర్ అని నేను చెబుతాను. కిల్లర్ డాగ్స్."
అలాగే మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ.. "సార్..దయచేసి మొత్తం 5 లక్షల కుక్కలను డాగ్ హోమ్‌గా మార్చండి. అందులో మేయర్ గద్వాల విజయను కూర్చోబెట్టండి" అన్నాడు ఆర్జీవీ. రాష్ట్ర పౌరులుగా కుక్కల బెడదను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కేటాయించిన రూ.18 కోట్లు ఎక్కడ, ఎలా ఖర్చు చేశారో తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అలాగే.. నాతో.. కుక్కల ప్రేమికురాలైన గద్వాల విజయ, ఆమె బృందంతో కలిసి టీవీ చర్చలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. అందుకు ఆమె ఒప్పుకోని నేపథ్యంలో అసలు కుక్కలు ఎవరో ప్రజలకు తెలుస్తుందని వ్యగ్యంగా ట్వీట్ చేశారు.