Dollysohi సోదరి చనిపోయిన కొన్ని గంటల్లో నటి కూడా కన్నుమూత

డాలీ సోహి గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడి మార్చి 8 ఉదయాన మరణించారు;

Update: 2024-03-08 06:45 GMT

డాలీ సోహి గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడి మార్చి 8 ఉదయాన మరణించారు. ఆమె సోదరి అమన్‌దీప్ సోహి కూడా నటి.. ఆమె మార్చి 7, గురువారం నాడు కామెర్ల కారణంగా మరణించారు. నెల రోజులుగా ఆమె అస్వస్థతతో ఉన్నారు. వీరి సోదరుడు 'మన్ను సోహి' ఈ మరణ వార్తలను ధృవీకరించారు. కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరినీ కోల్పోవడంతో కుటుంబం కృంగిపోయిందని వివరించారు. డాలీ అంత్యక్రియలు మధ్యాహ్నం జరుగుతాయని కూడా ఆయన పంచుకున్నారు.

డాలీ సోహి గర్భాశయ క్యాన్సర్‌ బారినపడి 47 వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. జనక్, భాభీ వంటి టీవీ షోలతో పాపులారిటీని సొంతం చేసుకున్న డాలీ మరణవార్త అందరినీ కలచివేసింది. ఆమె గర్భాశయ కేన్సర్ బారినపడినట్టు ఆరు నెలల క్రితమే నిర్ధారణ అయింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. కేన్సర్ ఆమె ఊపిరితిత్తుల వరకు పాకిందని.. ఆరోగ్యం క్షీణించడంతో గతరాత్రే డాలీని ఆసుపత్రిలో చేర్చామని ఆమె సోదరుడు మన్‌ప్రీత్ తెలిపారు. డాలీ సోదరి, నటి అమన్‌దీప్ సోహి పచ్చకామెర్ల వ్యాధితో డీవీ పాటిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.


Tags:    

Similar News