అక్క‌డ హిట్‌.. ఇక్క‌డ ఫ‌ట్‌..!

ఈ ఏడాది చాలా తక్కువ బడ్జెట్ తో సాదాసీదాగా థియేటర్స్ లోకి దిగిన కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 2 థియేటర్స్ లో దుమ్ము దులిపి ఈ ఏడాది [more]

Update: 2019-04-19 06:03 GMT

ఈ ఏడాది చాలా తక్కువ బడ్జెట్ తో సాదాసీదాగా థియేటర్స్ లోకి దిగిన కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 2 థియేటర్స్ లో దుమ్ము దులిపి ఈ ఏడాది మొట్టమొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పెద్ద పెద్ద సినిమాలనే తొక్కేసి.. 60 కోట్ల కలెక్షన్స్ తో అదరగొట్టే హిట్ అందించింది నిర్మాత దిల్ రాజుకి, ఎఫ్ 2 విడుదలైన రెండు నెలల పాటు సరైన సినిమా లేకపోవడంతో.. ఎఫ్ 2 కి తిరుగులేకుండా పోవడంతో కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక సినిమా విడుదలైన నెలన్నరకే ఎఫ్ 2 సినిమా అమెజాన్ ప్రైమ్ లో కూడా వచ్చేసింది. అయితే థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్, అమెజాన్ ప్రైమ్ లో రాలేదు. ఎఫ్ 2 థియేటర్స్ లో హిట్. అమెజాన్ లో ఫ్లాప్ అనే న్యూస్ నడిచింది.

టాప్ లో ఉంటుంది అనుకుంటే…

తాజాగా వెండితెర మీద బ్లాక్ బస్టర్ అయిన ఎఫ్ 2 బుల్లితెర మీద మాత్రం ఆ సత్తా చాటలేకపోయింది. బాహుబలి తర్వాత, గీత గోవిందం టాప్ లో నిలిస్తే.. ఆ ఆ తర్వాత గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం బుల్లితెర మీద టీఆర్పీ రేటింగ్స్ లో ది బెస్ట్ గా నిలిచింది. మరి ఎఫ్ 2 ఆ సినిమాల సరసన నిలుస్తుండిన ఆశపడిన ఛానల్ కి ఎఫ్ 2 నిరాశనే మిగిల్చింది. విడుదలైన మూడు నెలలకు మాటీవీలో ప్రసారం అయిన ఈ మూవీ 17.2 రేటింగ్ తెచ్చుకుంది. మరి వెండితెర మీద బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎఫ్ 2 బుల్లితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేయలేకపోయింది. కారణం ఎఫ్ 2 సెకండ్ హాఫ్ ని ఫామిలీస్ అంతగా ఆదరించలేకపోవడమే అంటున్నారు.

Tags:    

Similar News