రేపటి సినిమాలకు ఎఫెక్ట్ తప్పదా..?

Update: 2018-12-06 13:01 GMT

రేపు తెలంగాణలో ఒకవైపు ఎన్నికల హడావిడి, మరోవైపు సినిమాల విడుదల హడావిడి. ఒకపక్క ఓటు హక్కు వినియోగించుకోమని స్టార్ క్యాంపైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్టార్స్ కోరుతున్నారు. మరో వైవు విడుదల సినిమాల హడావిడి. తమ సినిమాల మీద ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించేందుకు ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ అంటూ హడావిడి చేస్తున్నారు. అయితే సినిమా విడుదల రోజున ఏ సినిమాకైనా ఓపెనింగ్స్ బాగుంటేనే ఆ సినిమాకి కాస్తో కూస్తో కలెక్షన్స్ వస్తాయి. కానీ రేపు విడుదల కాబోతున్న మూడు నాలుగు సినిమాలకు ఓపెనింగ్స్ రావాలంటే కాస్త కష్టంగానే కనబడుతుంది.

ఎన్నికల దెబ్బ పడుతుందా..!

సుమంత్... సుబ్రమణ్యపురం తో రేపు వస్తుంటే.... బెల్లంకొండ శ్రీనివాస్ కవచంతో వస్తున్నాడు, ఇక మరో టాప్ హీరోయిన్ తమన్నా నటించిన నెక్స్ట్ నువ్వే సినిమా కూడా రేపే విడుదల కాబోతుంది. గత వారం విడుదలైన 2.ఓ సినిమా హిట్ అయితే రెండో వారంలోనూ 2.ఓ హడావుడితో తమ సినిమాలకు కలెక్షన్స్ రావని వెనక్కి వెళ్ళిపోయేవారు. కానీ 2.ఓ తెలుగు రాష్ట్రాల్లో చతికిల పడడంతో సినిమాలన్నీ ఈ శుక్రవారం వచ్చేస్తున్నాయి. అయితే 2.ఓ కి భయపడకపోయినా... ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలకు ఈ సినిమాలు జడవాల్సిందే. ఎందుకంటే రేపు 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎన్నికల హడావిడిలో జనాలు థియేటర్ల వైపు రారు.

ఓపెనింగ్స్ కష్టమేనా..?

ఇక కాస్తో కూస్తో ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చినప్పటికీ... ఆ సినిమాలు బాగుంటే హడావిడి ఉంటుంది. లేదంటే సినిమా చూసిన జనాలు సినిమా బాలేదని స్ప్రెడ్ చేశారా... మనోళ్ల పని అవుట్. అందుకే బుక్ మై షోలో కూడా షోస్ ప్రస్తుతం వెలవెల బోతున్నాయి. ఎలాగూ తెలంగాణలో వరుస సెలవులు ఉన్నా పెద్దలు రాజకీయాల మీదున్న ఇంట్రెస్ట్ తో టీవీలకు అతుక్కుపోవడం ఖాయం. అందుకే రేపు విడుదల కాబోయే చిత్రాలు ఓపెనింగ్స్ బాగా దెబ్బపడేలా కనబడుతుంది.

Similar News