ప్రముఖ సింగర్ కన్నుమూత

ప్రముఖ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు;

Update: 2024-02-29 13:10 GMT

ప్రముఖ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. పవన్ కళ్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్ లోని 'గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల' గీతాన్ని ఆలపించి మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఆయన పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వడ్డేపల్లి శ్రీనివాస్ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కొన్ని రోజుల కిందటే డిశ్చార్జి అయ్యారు. ఇంతలోనే ఆయన ప్రాణాలు వదిలారు.

వడ్డేపల్లి శ్రీనివాస్ జానపద గాయకుడిగా ఎంతో గుర్తింపు పొందారు. 100కి పైగా ప్రైవేట్ సాంగ్స్ తో అలరించారు. గబ్బర్ సింగ్ చిత్రంలోని పాటకు ఆయన ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. వడ్డేపల్లి శ్రీనివాస్‌ మృతిపై పలువురు సినీ ప్రముఖులు, జానపద కళాకారులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News