ప్రముఖ సింగర్ కన్నుమూత
ప్రముఖ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూశారు. గజల్స్ పాడుతూ ఆయన;
ప్రముఖ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూశారు. గజల్స్ పాడుతూ ఆయన ఎంతో పాపులారిటీని సాధించారు. 72 ఏళ్ల పంకజ్ ఉధాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌కు చెందిన పంకజ్ ఉధాస్ కి 2006లో పద్మశ్రీ వచ్చింది. ఆయన హిందీతో పాటు పలు భాషల్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. ఆయన మరణవార్తను కూతురు నయాబ్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 26వ తేదీన పంకజ్ ఉధాస్ మరణించారంటూ పోస్టు పెట్టారు.
పంకజ్ ఉదాస్.. గజల్స్‌కు పర్యాయపదంగా పేరు సంపాదించుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన తన గజల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భారతదేశంలోని గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో మే 17, 1951న జన్మించిన ఉధాస్ సంగీత ప్రయాణం చిన్న వయస్సులోనే ప్రారంభమైంది. ఆయన అన్నయ్య మన్హర్ ఉదాస్ బాలీవుడ్‌లో విజయవంతమైన ప్లేబ్యాక్ సింగర్ గా ఉన్నారు. 1980లో, తన మొదటి గజల్ ఆల్బమ్ "ఆహత్"ని విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన కెరీర్ మరింత ఊపందుకుంది. ఉధాస్ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.