అనుష్క కి వర్కౌట్ అయ్యేలా ఉంది!!

నిశ్శబ్దం తో అనుష్క కెరీర్ కి శుభం కార్డ్. ఇక అనుష్క సినిమాలు మానేస్తుంది. అనుష్క కి ఎవరు అవకాశాలు ఇవ్వరు. అనుష్క బరువు ఆమెకి శాపం. [more]

Update: 2020-10-11 08:01 GMT

నిశ్శబ్దం తో అనుష్క కెరీర్ కి శుభం కార్డ్. ఇక అనుష్క సినిమాలు మానేస్తుంది. అనుష్క కి ఎవరు అవకాశాలు ఇవ్వరు. అనుష్క బరువు ఆమెకి శాపం. ఇలా చాలా రకాలుగా ప్రచారం జరిగింది. కానీ అనుష్క మాత్రం నేను సినిమాలు చేస్తున్నాను. నా నిర్మాతలు త్వరలోనే ఆ విషయం ప్రకటిస్తారని చేబుతుంది. అయితే ఇప్పుడు అనుష్క ని ఓ సినిమాలో తీసుకోమంటూ ఓ దర్శకుడికి అభిమానులు రిక్వెస్ట్ లు పెడుతున్నారట. అదెవరో కాదు.. రుద్రమదేవితో అనుష్క కి మంచి హిట్ ఇచ్చిన గుణశేఖర్. అనుష్క ఇప్పుడు లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు పర్ఫెక్ట్ అని తెలుస్తుంది. ఇక అనుష్క తో గుణశేఖర్ గతంలో రుద్రమదేవి సినిమా చేసాడు. అప్పటినుండి గుణ శేఖర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయకపోయినా అనుష్క లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో, బాహుబలితో అదరగొట్టేసింది.

అయితే తాజాగా గుణ శేఖర్ తాను పాన్ ఇండియా లెవల్ లో మహాభారతమలోని ఆదిపర్వం ఆధారంగా శాకుంతలం సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా ఓ మోషన్ పోస్టర్ తో ప్రకటించాడు.మరి ఈ సినిమా లేడి ఓరియెంటెడ్ అని అర్ధమవుతుంది. జస్ట్ టైటిల్ ని ప్రకటించిన గుణ శేఖర్ ఈ సినిమాలో నటించే నటి నటుల వివరాలు చెప్పలేదు. అయితే గుణ శేఖర్ చెయ్యబోయే శాకుంతలం ప్రేమ కావ్యంలో అనుష్క హీరోయిన్ అయితే బావుంటుంది.. అనుష్క అయితే ఆ కథని రక్తి కట్టిస్తుంది.. సో శాకుంతలం హీరోయిన్ గా అనుష్కని తీసుకోమని గుణ శేఖర్ కి అభిమానులు ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. మరి వాళ్ళ రిక్వెస్ట్ లు అనుష్క కి అనుకూలంగా మారితే పాన్ ఇండియా లెవల్లో అనుష్క కి అది వర్కౌట్ అయినట్లే అంటున్నారు. ఎలాగూ అనుష్క కి స్టార్ హీరోల ఛాన్సెస్ లేవు. సో ఇలాంటి లేడి ఓరియెంటెడ్ అనుష్కకి అయితే బావుంటుంది అని వాళ్ళ ఉద్దేశ్యం. 

Tags:    

Similar News