Guntur Kaaram : 'కుర్చీ మడతపెట్టి' తాతకి డబ్బులు ఇచ్చిన థమన్..!

'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కుర్చీ తాతకి డబ్బులు ఇచ్చారట. ఎంతో తెలుసా..?;

Update: 2023-12-30 09:01 GMT
Guntur Kaaram, thaman, kurchi thatha, Kurchi Madathapetti Song, Mahesh Babu
  • whatsapp icon
Guntur Kaaram : మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మహేష్ ఇపప్టివరకు కనిపించనంత మాస్ అవతార్ లో కనిపించబోతున్నారట. దీంతో సినిమాలో మహేష్ పై సాంగ్స్ ని కూడా అంటే మాస్ లో రెడీ చేస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్‌గా.. ఈ మూవీ నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'కుర్చీ మడతపెట్టి' అనే బూతు పదాన్ని ఉపయోగించారు.
హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉండే ఓ తాత.. ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ.. ఈ 'కుర్చీ మడతపెట్టి' అనే బూతు పదాన్ని వాడాడు. అది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక ఆ పదం మీద ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోస్, డీజే సాంగ్స్.. ఇలా బాగా వైరల్ అయ్యిపోయింది. ఇక మాస్ లో ఈ పదానికి బాగా రీచ్ ఉండడంతో.. ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో వాడేశారు.
ఇక ఈ డైలాగ్ ని తమ సాంగ్ వాడుకున్నందుకు గుంటూరు కారం మూవీ టీం.. ఆ తాతకి డైలాగ్ రైట్స్ కింద డబ్బులు కూడా ఇచ్చారట. మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. తాతని తన దగ్గరికి రప్పించుకొని రూ.1లక్ష ఇచ్చారట. ఈ విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో ఆ తాతే అందరికి తెలియజేసారు. తన మాట్లాడిన పదాన్ని మహేష్ బాబు వంటి స్టార్ సినిమాలో ఉపయోగించినందుకు తనకి సంతోషం ఉందని చెప్పుకొచ్చాడు.
ఇది ఇలా ఉంటే, మహేష్ బాబు వంటి స్టార్ సినిమాలో 'కుర్చీ మడతపెట్టి'(Kurchi madthapetti)వంటి బూతు ఉపయోగించడం పై కొందరు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.
Tags:    

Similar News