తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయినా.. తమిళంలో మాత్రం సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ.... స్టార్ హీరోల సరసన ఎక్కువగా నటించలేకపోయింది పాల బుగ్గల హన్సిక. తెలుగులో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సరసన నటించినప్పటికీ... ఇక్కడ మాత్రం స్టార్ డం సంపాదించలేకపోయింది. అందుకే తమిళనాట హీరోయిన్ గా సెటిల్ అయిన ఈ భామకు అభిమానులు గుడి కూడా కట్టేశారు. అయితే హన్సిక గ్లామర్ భామగా అందాలు ఆరబోసినా.. లక్కు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. శింబు తో ప్రేమ వ్యవహారం తర్వాత హన్సిక నటించిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు.
ప్రస్తుతం తమిళనాట మహా అనే సినిమాలో నటిస్తున్న హన్సిక ఇప్పుడు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. అంటే హన్సిక నటనకు బై బై చెప్పేసి పెళ్లి చేసుకుంటుందనుకుంటున్నారా... కాస్త ఆగండి హన్సిక తీసుకున్న డెసిషన్ ఏమిటంటే... అది ఆమె కెరీర్ కి సంబందించినది. ఇంతవరకూ గ్లామర్ హీరోయిన్ గా నటించిన హన్సిక ఇకపై అందాల ఆరబోతకు బై బై చెప్పేస్తానంటోంది. గ్లామర్ పరమైన పాత్రలు వదిలేసి... నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటిస్తానంటోంది. మరి కాస్త బొద్దుగా మారిన హన్సిక డెసిషన్ తమిళ దర్శక నిర్మాతలు ఏమాత్రం స్వాగతిస్తారో అనేది కాస్త ఆలోచించాల్సిన విషయం.
ఇక గ్లామర్ పాత్రలు కాకుండా మెస్సేజ్ ఓరియెంటెడ్ మూవీస్ అంటే.. హీరోయిన్ ప్రాధాన్యమున్న పాత్రలైతేనే కుదురుతాయి. మరి హన్సిక నయనతార, అనుష్క మాదిరిగా లేడి ఓరియెంటెడ్ పాత్రలను ఏ మాత్రం హ్యాండిల్ చెయ్యగలదో.. ఎందుకంటే త్రిష కూడా గ్లామర్ పాత్రలకు సెండాఫ్ ఇచ్చేసి ఇలానే లేడి ఓరియెంటెడ్ పాత్రలు చేస్తుంది... కానీ అమావాస్యకో.. పున్నానికో ఒక హిట్ అన్నట్టుగా ఉంది త్రిష పరిస్థితి. మరి హన్సిక కూడా త్రిష రూటే ఎన్నుకుంది. చూద్దాం త్రిషలా కాకూండా హన్సిక నయనతార లాంటి హిట్స్ అందుకుంటుందేమో...!