బాలకృష్ణ కాలికి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మరో యాక్షన్ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఇటీవలే ఆయన కుడిభుజానికి..
హైదరాబాద్ : గతేడాది అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మరో యాక్షన్ సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఇటీవలే ఆయన కుడిభుజానికి శస్త్ర చికిత్స జరిగింది. అఖండ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక చిన్న ప్రమాదంలో ఆయన కుడిభుజంకు గాయం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన విషయం విధితమే. తాజాగా బాలకృష్ణకు మరో శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు.
కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతోన్న బాలకృష్ణకు వైద్యులు.. మైనర్ సర్జరీ నిర్వహించారు. బాలకృష్ణ మోకాలికి జరిగింది చిన్న ఆపరేషనే అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించారు. కొద్దిరోజులపాటు బాలకృష్ణ విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుందని తెలిపారు. సర్జరీ అనంతరం బాలకృష్ణ వైద్యులతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆ ఫొటో కింద కామెంట్స్ చేస్తున్నారు.