రామ్ చరణ్ ఒప్పేసుకున్నాడు..!

రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో తెరకెక్కిన వినయ విధేయ రామ అభిమానుల అంచనాలను అందుకోలేక ఢమాల్ అన్న సంగతి తెలిసిందే. సుమారు ముప్పై కోట్ల మేర [more]

;

Update: 2019-02-05 08:39 GMT
కరోనా
  • whatsapp icon

రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో తెరకెక్కిన వినయ విధేయ రామ అభిమానుల అంచనాలను అందుకోలేక ఢమాల్ అన్న సంగతి తెలిసిందే. సుమారు ముప్పై కోట్ల మేర వినయ విధేయ రామ వల్ల బయ్యర్లు నష్టపోయారని… గత కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే వినయ విధేయ రామ సినిమా విడుదలయ్యాక అటు బోయపాటి కానీ.. ఇటు రామ్ చరణ్ కానీ ఆ సినిమా ఫలితంపై ఎక్కడా స్పందించలేదు. అసలు మీడియాకి దొరకనే లేదు. బోయపాటి అండర్ గ్రౌండ్ కి వెళ్లాడనే న్యూస్ బాగా ప్రచారం జరిగింది. ఇక రామ్ చరణ్ మాత్రం #RRR సెకండ్ షెడ్యూల్ లో బిజీ అయ్యి వినయ విధేయ రామని పట్టించుకున్న పాపాన పోలేదు.

vinaya vidheya rama producer returning money to distributers

ప్రెస్ నోట్ విడుదల చేసిన చరణ్

తాజాగా వినయ విధేయ రామ ఫలితంపైన రామ్ చరణ్ ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసాడు. ఆ ప్రెస్ నోట్ లో.. ‘‘వినయ విధేయ రామ సినిమా కోసం క్నీషియన్స్ దగ్గర నుండి నటీనటుల వరకు చాలా కష్టపడ్డాము…. కానీ సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది.. నా పట్ల, సినిమా పట్ల మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు… నిర్మాత దానయ్య గారి సహకారం ఎప్పటికి మరువలేనిది… అలాగే మా సినిమాని నమ్మిన పంపిణీదారులకు సర్వదా కృతజ్ఞతలు తెలుపుంటున్నాను’’ అని రామ్ చరణ్ పేర్కొన్నారు. మా నుండి పూర్తి వినోదాత్మకమైన మంచి చిత్రాన్ని మీకు అందించాలనుకున్నామని.. కానీ దురదృష్టవశాత్తు మీ అంచనాలను మా సినిమా అందుకోలేకపోయింది.. భవిష్యత్తులో మీరు మెచ్చే, నచ్చే సినిమాలు చేస్తానని రామ్ చరణ్ అన్నారు. మరి రామ్ చరణ్ ఈ ప్రెస్ నోట్ తో వినయ విధేయ రామ ఫ్లాప్ అయ్యిదని డైరెక్ట్ గానే ఒప్పేసుకున్నాడు.

Tags:    

Similar News