హీరో శ్రీవిష్ణును హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
హీరో శ్రీవిష్ణును హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.. హీరో శ్రీవిష్ణు కొన్నాళ్లుగా ఆయన డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నట్లు సమాచారం.;
యువ కథానాయకుడు శ్రీవిష్ణు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా శ్రీవిష్ణు తీవ్రమైన వైరల్ ఫీవర్‌తో బాధ పడుతున్నారు. ఆయన ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పడిపోవడంతో.. ఈ రోజు ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఈరోజు ఉదయం హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.
హీరో శ్రీవిష్ణు కొన్నాళ్లుగా ఆయన డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నట్లు సమాచారం. ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకుంటున్న శ్రీవిష్ణు ప్లేట్ లెట్స్ బాగా పడిపోయాయట. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో శ్రీవిష్ణుకు చికిత్స అందిస్తున్నారు. ఇక శ్రీవిష్ణు అనారోగ్యానికి గురయ్యాడని తెలుసుకున్న అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవిష్ణు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీవిష్ణు అల్లూరి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయన పవర్ ఫుల్ పోలీస్ పాత్ర చేస్తున్నారు. శ్రీవిష్ణు కోలుకున్న వెంటనే మిగిలిన సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.