రిస్కీ షాట్ చేసి.. ఎముకలు విరగ్గొట్టుకున్న హీరో విశాల్
లాఠీ సినిమా థర్డ్ షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నారు. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో..
యాక్షన్ హీరో విశాల్.. ఓ రిస్కీ షాట్ చేసి కుడిచేతి ఎముకలు విరగ్గొట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన లాఠీ అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమా ఫైట్ సీన్స్ లో భాగంగా.. భారీ స్టంట్ సీక్వెన్స్ లో విశాల్ పాల్గొన్నారు. రిస్కీ షాట్ అని తెలిసి కూడా డేర్ చేశారు. కానీ.. ఆయన కుడిచేతికి, చేతి వేళ్లకు గాయాలై.. రక్తం కారింది. దాంతో తాత్కాలికంగా లాఠీ షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశారు. "లాఠీ సినిమా స్టంట్ సీక్వెన్స్ చేస్తుంటే గాయాలయ్యాయి. విశ్రాంతి, మెరుగైన చికిత్స కోసం కేరళ వెళ్తున్నా. మళ్లీ మార్చి తొలివారంలో సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటా" అని విశాల్ ట్వీట్ చేశారు.
Also Read : ముచ్చింతల్ కు మెగాస్టార్
కాగా.. లాఠీ సినిమా థర్డ్ షెడ్యూల్ షూటింగ్ ను హైదరాబాద్ లోనే నిర్వహిస్తున్నారు. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఓ భారీ అండర్ కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ లో ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఓ చిన్న పిల్లాడిని పట్టుకుని బిల్డింగ్ పైనుంచి కిందకు దూకాల్సిన షాట్ ను డూప్ లేకుండా విశాల్ చేశాడు. సీన్ లో భాగంగా నిజమైన రాళ్ల పైన దూకాల్సి రావడంతో.. విశాల్ డేర్ చేశాడు. ఈ రిస్కీ షాట్ లో.. రాళ్లపైన పడటంతో విశాల్ కుడి మోచేయి, చేతివేళ్ల ఎముకల్లో వెంట్రుక వాసి పగుళ్లు వచ్చాయి.3 వారాల విశ్రాంతితో పాటు నేచురల్ వైద్యం అవసరమవ్వడంతో విశాల్ కేరళకు వెళ్లారు. కాగా.. ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో సమ్మర్ ట్రీట్ గా మే 5న విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్.