సాయి పల్లవికి కోపం వచ్చింది..!

సాయి పల్లవితో చాలా కష్టం అంటుంటారు ఆమెతో పనిచేసిన దర్శకనిర్మాతలు. తన పాత్ర నచ్చకపోతే.. ఆమె సినిమాని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తుంది. అందుకే ఆమెకి కథ చెప్పాలంటే [more]

Update: 2019-05-03 08:36 GMT

సాయి పల్లవితో చాలా కష్టం అంటుంటారు ఆమెతో పనిచేసిన దర్శకనిర్మాతలు. తన పాత్ర నచ్చకపోతే.. ఆమె సినిమాని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తుంది. అందుకే ఆమెకి కథ చెప్పాలంటే దర్శకనిర్మాతలకు తలప్రాణం తోకకు వస్తుంది. ఇక తెలుగులో తనకి లైఫ్ ఇచ్చిన దిల్ రాజు లాంటి నిర్మాతకే శ్రీనివాస కల్యాణంలో తన పాత్ర నచ్చలేదనే నో చెప్పేసింది. అయితే తాజాగా సాయి పల్లవికి ఒక విషయంలో కోపం వచ్చిందని అందుకే దర్శకనిర్మాతలకు పిలిచి వార్నింగ్ ఇచ్చిందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఆలస్యం చేయడంపై ఆగ్రహం

అసలు సాయి పల్లవికి కోపమెందుకు వచ్చింది అంటే… సాయి పల్లవి మెయిన్ లీడ్ లో రానా ప్రధాన పాత్రలో వేణు ఉడుగుల అనే డైరెక్టర్ విరాటపర్వం సినిమాని అనౌన్స్ చేసాడు. అయితే వేణు ఉడుగుల విరాటపర్వం స్క్రిప్ట్ మీద చాలా రోజుల నుండి కూర్చుకున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి డీగ్లామర్ గా నక్సలైట్ పాత్రలో కనిపించబోతుంది. ఇక రానా కూడా వార్డ్ మెంబర్ గా పొలిటికల్ క్యారెక్టర్ చేయబోతున్నాడని, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు లేడి విలన్ గా నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని ఇంకా పట్టాలెక్కించకుండా మీనమేషాలు లెక్కబెడుతున్న డైరెక్టర్ మీద సాయి పల్లవి ఫైర్ అయ్యిందట.

లేట్ చేస్తే తప్పుకుంటా…!

ఈ సినిమాలో కీలకపాత్ర కావడంతో సాయి పల్లవి ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి వచ్చిందట. అయితే సాయి పల్లవి డేట్స్ వృధా అయిపోతున్నా… ప్రీ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమా షూటింగ్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమాకి ఎక్కువ డేట్స్ ఇచ్చిన కారణంగా మిగతా సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక సాయి పల్లవి ఇబ్బంది పడుతుండటం ఆమె విరాటపర్వం టీం కి వార్నింగ్ ఇచ్చిందట. ఎంత వీలయితే అంత త్వరగా సినిమా మొదలు పెట్టమని.. లేదంటే ఈ సినిమా నుండి తప్పుకుంటానని బెదిరించిందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది.

Tags:    

Similar News