హిందీలో రీమేక్ అవుతున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’
రాజ్‌కుమార్ రావ్ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో.. హిందీలో రీమేక్ అవుతున్నతెలుగు సెన్సేషనల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై, ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా [more]
;
రాజ్‌కుమార్ రావ్ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో.. హిందీలో రీమేక్ అవుతున్నతెలుగు సెన్సేషనల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై, ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా [more]
రాజ్‌కుమార్ రావ్ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో.. హిందీలో రీమేక్ అవుతున్నతెలుగు సెన్సేషనల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’
ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై, ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రం ‘హిట్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు మరింత చేరువ కానుంది. ‘హిట్’ చిత్రం హిందీలో రీమేక్ అవుతుంది. పోలీస్ డ్రామాగా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ హిందీ రీమేక్‌లో రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తున్నారు.
హిట్..హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో పనిచేసే ఓ పోలీస్ ఆఫీసర్ అనుమానాస్పదంగా మిస్ అవుతున్న అమ్మాయిల గురించి అన్వేషిస్తుంటాడు. ఈ కేసులను ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదిస్తాడు? అనేదే సినిమా కథాంశం. డైరెక్టర్ శైలేష్ కొలను ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అద్భుతంగా తెరకెక్కించారు. హిందీ రీమేక్‌ను కూడా శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2021లో సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ – ‘‘హిట్ సినిమాకు సంబంధించి ఫస్ట్ కేస్ అనే క్యాప్షన్ పెట్టాం. ఈ ఫస్ట్ కేస్‌లో హీరో తన గతం, వర్తమానానికి సంబంధించి ఏదో మానసిక సంఘర్షణను అనుభవిస్తుంటాడు. ఇలాంటి ఓ సంఘర్షణతో కూడిన పాత్రను ప్రేక్షకులను కన్విన్స్ చేసేలా ఓ మెచ్యూర్డ్ యాక్టర్ చేస్తే బావుటుందని ఆలోచిస్తున్న తరుణంలో రాజ్ కుమార్ రావ్ ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నటించిన ‘సైతాన్’ సినిమా నుండి ఆయన సినిమాలను ఫాలో అవుతున్నాను. ఆయనొక అద్భుతమైన నటుడు. ప్రతి సందర్భంలో నటుడిగా నన్ను ఆశ్చర్యపరుస్తూనే వచ్చారు. రాజ్‌కుమార్ రావ్, దిల్‌రాజుగారితో కలిసి పనిచేయనుండటం ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది. హిట్ సినిమా ఫ్రాంచైజీ మన దక్షిణాది ప్రేక్షకులనే కాదు ఉత్తరాది ప్రేక్షకులను కూడా కచ్చితంగా ఆకట్టుకుంది. యూనివర్సల్ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రమిది. బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి, నెటివిటీకి తగినట్లు చిన్న చిన్న మార్పులను చేస్తాను’’ అన్నారు.
హీరో రాజ్‌కుమార్ రావ్ మాట్లాడుతూ – ‘‘నేను హిట్ సినిమాను చూడగానే కనెక్ట్ అయిపోయాను. ప్రస్తుతం మన సమాజానికి అవసరమైన కథాంశంతో తెరకెక్కిన ఎంగేజింగ్ మూవీ. ఓ నటుడిగా ఇలాంటి ఓ పాత్ర కోసం ఎదురుచూస్తున్న తరుణంలో హిట్ సినిమా చేసే అవకాశం వచ్చింది. దిల్‌రాజుగారు, శైలేష్ కొలనుగారితో కలిసి ఈ సినిమాకు పనిచేయనుండటం హ్యాపీగా ఫీలవుతున్నాను’’ అన్నారు.
దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై నాని ‘జెర్సీ’ చిత్రాన్నిషాహిద్ కపూర్‌తో హిందీలో రీమేక్ చేస్తున్న టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు. . బాలీవుడ్ నిర్మాత కుల్‌దీప్ రాథోర్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.