నేను సింగిల్ అంటున్న హీరోయిన్?

తెలుగులో పట్టుమని నాలుగు సినిమాల్లో  నటించలేదు.. అప్పుడే ఆ హీరోయిన్ టాలీవుడ్ హీరో లవ్ లో ఉందని.. డేటింగ్ చేస్తుంది అంటూ ప్రచారం సోషల్ మీడియాలో ఓ [more]

Update: 2020-10-24 05:23 GMT

తెలుగులో పట్టుమని నాలుగు సినిమాల్లో  నటించలేదు.. అప్పుడే ఆ హీరోయిన్ టాలీవుడ్ హీరో లవ్ లో ఉందని.. డేటింగ్ చేస్తుంది అంటూ ప్రచారం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో స్టార్ట్ అయ్యింది. ఆమె ఎవరో కాదు.. సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో సక్సెస్ కాలేకపోయినా.. పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ తో ఒక్కసారిగా సూప్ హిట్ కొట్టిన నిధి అగర్వాల్. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గని నిధి గ్లామర్ కి కుర్రాళ్ళు పడిపోవాల్సిందే. అయితే అందాల నిధి అగర్వాల్ టాలీవుడ్ లో ఓ హీరోతో ప్రేమలో పడింది అని… అతనితో డేటింగ్ లో ఉంది అంటూ ప్రచారం మొదలయ్యింది.

కానీ నిధి అగర్వాల్ మాత్రం ఛ ఛ అలాంటిదేం లేదు. నేను హీరోతో లవ్ లో లేను.. నేను ఇంకా సింగల్ గానే ఉన్నాను అంటుంది. నేను ఎవరితోనూ డేటింగ్ లో లేనని క్లియర్ కట్ గా తన మీద వస్తున్నా గాసిప్స్ కి చెక్ పెట్టింది. మరి కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నిధి అగర్వాల్ ఇటు తెలుగు అటు తమిళ సినిమాల్లో నటిస్తుంది. కాకపోతే ఇస్మార్ట్ హిట్ తర్వాత నిధి బాగా బిజీ అవ్వుద్ది అనుకుంటే.. కేవలం మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ సినిమాలో మాత్రమే నటిస్తుంది.

Tags:    

Similar News