చిన్నప్పుడు అమ్మ సంతకం ఫోర్జరీ చేశా?
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ లో తామేం చేస్తున్నామో చెప్పడమే కాదు.. చిన్నపుడు తాము చేసిన చిలిపి పనుల దగ్గరనుండి… అల్లరి వరకు సోషల్ మీడియాలో అభిమానులతో [more]
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ లో తామేం చేస్తున్నామో చెప్పడమే కాదు.. చిన్నపుడు తాము చేసిన చిలిపి పనుల దగ్గరనుండి… అల్లరి వరకు సోషల్ మీడియాలో అభిమానులతో [more]
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ లో తామేం చేస్తున్నామో చెప్పడమే కాదు.. చిన్నపుడు తాము చేసిన చిలిపి పనుల దగ్గరనుండి… అల్లరి వరకు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు హీరో, హీరోయిన్స్. హీరోల కన్నా ఎక్కువగా హీరోయిన్స్ తాము చేసిన పనులను మాత్రం సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. తాజాగా చిన్నపుడు తానెలాంటి పనులు చేసానో చెబుతుంది హాట్ గర్ల్ నిధి అగర్వాల్. అక్కినేని హీరోలతో చేసిన సినిమాలేవి క్రేజ్ తేకపోయియినా.. రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రం నిధి అగర్వాల్ కి ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. లాక్ డౌన్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఈ ముంబై భామ.. తన చిన్న నాటి అల్లరిపనులను ఆభిమానులల్తో షేర్ చేసుకుంది.
చిన్నప్పుడు తనకి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు నాన్నని సంతకం పెట్టమంటే.. కొడతారని భయపడి.. కనీసం తల్లి నైనా సంతకం పెట్టమందామంటే ఆమె కోప్పడుతుంది.. తన తల్లి సంతకాన్ని తానే పెట్టేసేదట. ఎందుకంటే తన తల్లి సంతకం చెయ్యడం చాలా ఈజీ అంటుంది. నిధి. చాలా రోజులకు తల్లి సంతకం పెడుతున్నప్పుడు తన తల్లికి దొరికి పోయి చివాట్లు తిందట. ఇక తన తల్లి తనని చూసి గర్వపడిన సందర్భం ఏమిటి అంటే…తాను నటిగా స్క్రీన్ పై కనిపించిన రోజు అంటుంది. ప్రతి పనిలో తన తల్లి తన్ని సపోర్ట్ చేస్తుంది అని.. నువ్వు ఎప్పుడూ దేనికి బాధపడకు. నిన్ను నువ్వు ఎప్పుడో నిరూపించుకున్నావు. కొత్తగా నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సి లేదు అంటూ నా వెన్ను తడుతుంది అంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్.