అందుకే అవకాశాలు పోగొట్టుకున్నాను?
స్టార్ హీరో కూతురు అంటే ఎలా ఉంటారు. ఎలా ఉండాలి. స్టార్ కిడ్స్ అంటే ఓ రేంజ్ అవకాశాలతో దూసుకుపోతారు. కానీ శృతి హాసన్ అలా కాదు. [more]
స్టార్ హీరో కూతురు అంటే ఎలా ఉంటారు. ఎలా ఉండాలి. స్టార్ కిడ్స్ అంటే ఓ రేంజ్ అవకాశాలతో దూసుకుపోతారు. కానీ శృతి హాసన్ అలా కాదు. [more]
స్టార్ హీరో కూతురు అంటే ఎలా ఉంటారు. ఎలా ఉండాలి. స్టార్ కిడ్స్ అంటే ఓ రేంజ్ అవకాశాలతో దూసుకుపోతారు. కానీ శృతి హాసన్ అలా కాదు. ఒంటరిగానే పోరాడుతుంది. హీరోయిన్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ తనని తాను నిరూపించుకుంటూనే ఉంది. అయితే ఒకప్పుడు చాలా స్పీడుగా కెరీర్ లో దూసుకుపోయిన శృతి హాసన్ ఇప్పుడు చాలా డల్ అయ్యింది. ఆవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే అందుకు కారణం తన ముక్కుసూటి తనమే అంటుంది. ఎదుటి వాళ్ళ కేరెక్టర్ కానీ, వారు మట్లాడే మాటలు కానీ నచ్చకపోతే వాళ్ళు ఎంత పెద్ద వారైనా లెక్క చెయ్యదట. తానెప్పుడూ ముక్కుసూటిగాను, స్ట్రయిట్ ఫోర్వేర్డ్ గానే ఉంటుందట.
అందుకే సినిమా రంగంలో తాను చాలా కోల్పోయానని చెబుతుంది. తాను ఇలాంటి ముక్కుసూటి తనం వలెనే చాలా అవకాశాలు కోల్పోయానని.. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నాని.. అలా అని ఏడుస్తూ కూర్చోలేదని చెబుతుంది. అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే సినిమా రంగంలోనూ ఉంటుంది. అందుకే ఈ రంగంలోనూ తాను ముక్కుసూటిగా ఉంటూనే అవకాశాలు పొందగలుగుతున్నా అని.. మహిళలందరూ ఇలానే సొంత కాళ్ళ మీద, సొంత వ్యక్తిత్వంతో ముందుకు సాగాలని చెబుతుంది శృతి. మరి శృతి హాసన్ చెప్పేది నిజం. అవకాశాలు రావడం లేదు కదా అని.. హీరోయిన్ గా కెరీర్ ముగించక.. వచ్చిన అవకాశాలతో పూల బాట వేసుకుంటుంది.