నాకు చాలా తీవ్రమైన గుండెపోటు వచ్చింది.. కానీ : సుస్మితా సేన్

తనకు వచ్చిన గుండెపోటు చాలా తీవ్రమైనదని సుస్మితా పేర్కొంది. గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో 95 శాతం;

Update: 2023-03-05 06:13 GMT

ప్రముఖ బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఇటీవల తనకు గుండెపోటు వచ్చిందని నెట్టింట చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. ఆమెకు ఏమైందా అని అభిమానులంతా ఆందోళన చెందారు. అయితే తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు సుస్మితా సేన్ వెల్లడించింది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో తన అధికారిక ఖాతా ద్వారా నిర్వహించిన లైవ్ సెషన్ లో అందుకు సంబంధించిన వివరాలను సుస్మితా నెటిజన్లతో పంచుకుంది.

తనకు వచ్చిన గుండెపోటు చాలా తీవ్రమైనదని సుస్మితా పేర్కొంది. గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో 95 శాతం మూసుకుపోయింది. యాంజియో ప్లాస్టీ చేశారు. స్టెంట్ వేశారు. నా జీవితంలో అది ఒక దశ. ఇప్పుడది గడిచిపోయింది. కానీ.. నేనేమీ భయపడలేదు అని సుస్మితా పేర్కొంది. తన ప్రాణాలను కాపాడిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. సుస్మితా గుండెపోటుకు గురైందన్న వార్తలు వచ్చినప్పటి నుంచి అభిమానులు.. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ.. పెద్దఎత్తున పుష్పగుచ్ఛాలు పంపించారు. వాటితో తన ఇల్లంతా ఓ పూలతోటలా మారిందని, తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది.





Tags:    

Similar News